*నా అకౌంట్లో రైతుభరోసా డబ్బులు పడ్డయ్*
*పోమాలపల్లి గ్రామ యువ రైతు అనుమగల్ల రమేష్*
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతాభివందనములు*
తెలంగాణ వ్యాప్తంగా రైతుభరోసా సాయం కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా జనవరి 27న(అర్థరాత్రి) నుంచే రైతుల అకౌంట్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున జమవుతున్నాయి. రైతు భరోసా డబ్బులు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు రైతులు. కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందంటున్నారు. డబ్బులు పడ్డ అకౌంట్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు పలువురు రైతులు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం పోమాల పల్లికి చెందిన యువ రైతు అనుమగల్ల రమేష్ తన ఖాతాలో 31,800 రూపాయల రైతు భరోసా జమైనట్లు ఆ రైతు తనకు డబ్బులు పడినట్లు వచ్చిన ఎస్ఎంఎస్ స్క్రీన్ షాట్ను ప్రజాసాక్షి మీడియాతో పంచుకున్నాడు. ఈ డబ్బులు ఎరువులకు , వ్యవసాయ పనులకు వాడుకుంటానని ఆనందం వ్యక్తం చేశాడు. రైతు భరోసా డబ్బులు జమ చేసినందుకు రేవంత్ ప్రభుత్వానికి రైతు అనుమగల్ల రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
జనవరి 26న నాలుగు స్కీంలలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ స్కీం కింద వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏడాదికి రూ. 12వేలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొదటి విడత కింద ప్రభుత్వం ఎకరాకు రూ.6 వేలు జమ చేస్తుంది.
Courtesy / Source by :
*గంతల నాగరాజు రిపోర్టర్* (ప్రజల పక్షం మీడియా)
No comments:
Post a Comment