Saturday, December 24, 2022

బానిసలుగా బతుకుతారా??


*_ప్రశ్నించకుంటే బానిస బతుకే ౼అనంచిన్ని వెంకటేశ్వరరావు_*
_● కళాకారుడి కాళ్ళకు సాక్సులు తొడిగిన కోయిన్ని వెంకన్న_
_● పూర్వ పది జిల్లాల నుంచి హాజరయిన ఆర్టీఐ యోధులు_
_● భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన_
_● ఆకట్టుకున్న కళా బృందాలు_
_● ఘనంగా ముగిసిన ప్రజా చైతన్యయాత్ర_

*_ప్రజలు ప్రశ్నించటం మరచిపోతే బానిసల్లాగా బ్రతకాల్సి ఉంటుందని, బానిసలుగా బతుకుతారో, అంబేద్కర్ ఊహించిన భారతీయ పౌరులుగా స్వేచ్ఛగా బతుకుతారో తేల్చుకోవల్సిన తరుణం వచ్చిందని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టిజేఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రముఖ పరిశోధన పాత్రికేయులు అనంచిన్ని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ప్రజా చైతన్యయాత్ర ఖమ్మం జిల్లాలో సమాచార హక్కు ప్రచార వేదిక ఆధ్వర్వంలో 45 రోజులపాటు కోయిన్ని వెంకన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు._*

ఈ సందర్భంగా అనంచిన్ని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... పరుగు వేగంలో మాత్రమే ఒక చిన్నసెకను విలువ తెలుస్తోందని, ఆర్టీఐ సేవా సంస్థలను మొగ్గలో తుంచేయాలనే ప్రయత్నాలు అనేకం జరిగాయని, గ్రామస్థాయిలో కక్షలు ఎక్కవగా ఉంటాయని, అయినా కూడా గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం విషయంలో ఈ సంస్థ చేసిన, చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు. సభాధ్యక్షుడు కోయిన్ని వెంకన్న మాట్ఖలాడుతూ...45 రోజుల పాటు తమ ఆర్టీఐ కార్యకర్తలు చేసిన త్యాగాలు మరువలేనివని, ఆర్థిక భారం వెంటాడుతున్నా.. తమ.లక్ష్యాన్ని ఎవరూ వదల లేదని, భవిష్యత్తులో మరెన్నో చారిత్రక ఘట్టాలకు ఇది పునాదిగా ఉంటుందని, పూర్వ పది జిల్లాల నుంచి హాజరైన యోధులకు కృతజ్ఞతలను తెలిపారు. ఖమ్మం జిల్లాలో 45 రోజుల పాటి జరిగిన ఈ ప్రజా చైతన్యయాత్రలో పదిజిల్లాలకు చెందిన సూరన్న, శాంతకుమార్, వెంకటేశం, సుజాత సుకుమార్, పెదమ్మ విజయశ్రీను, కుమారి, స్వప్న, నరేంద్ర, సంజీవరావు మరియమ్మ, నిర్మల, శతక కృష్ణరావు, గోపయ్య ఇరవై ఆరుసరు ఆర్.టి.ఏ కార్యకర్తలతో పాటు రాఘవులు, పాల్వంచ రామారావు, జి.రామనాధం తదితరులు అతిథులుగా పాల్గొని అభినందనలు తెలిపారు. ప్రముఖ సేవాతత్పరుడు అన్నం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అన్నం శ్రీనివాసరావు శాలువాలతో సన్మానించారు.

బాక్స్:
*_కాళ్ళకు సాక్సులు తొడిగిన కోయిన్ని_*
45 రోజులపాటు క్రమం తప్పకుండా జరిగిన ఆర్టిఐ ప్రజా చైతన్య యాత్ర ముగింపు సభలో ఓ ఉద్విగ్నభరితమైన సన్నివేశం చోటు చేసుకుంది. నారాయణ అనే వృద్ద కళాకారుడు తన మనవడు చనిపోయినా.. ప్రజా చైతన్య యాత్రలో క్రమం తప్పకుండా పాల్గొన్నారు. ఈ సభలో ఆయనకు ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా సభాధ్యక్షుడు కోయిన్ని వెంకన్న నారాయణకు సాక్సులు తొడగటంతో సభలో ఓ ఉద్విగ్నభరితమైన వాతావరణం నెలకొంది.

బాక్స్:
*_పేదల ఇళ్ళు క్రీడా ప్రాంగణాలా..?_*
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం శనివారం కేశవాపురం గ్రామంలో రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా స్థానిక అధికారపార్టీ నాయకుల అండదండలు వత్తిళ్లతో ఆరుగాలం నుండీ నివసిస్తున్న నిరుపేద చాకలి మహిళల గుడిసెలు ఇండ్లు,షెడ్లు కూల్చి వేశారని, ఉన్న కొద్దిపాటి స్థలాలు ఆక్రమించుకుని పంచాయతీలో నమోదైన పేర్లు తొలగించి, క్రీడా ప్రాంగణం సాకుతో ఆక్రమించడం పట్ల స్థానిక ఎన్జీఓ 'మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ అధ్యక్షులు ఇశ్నపల్లి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ పిర్యాదు సేకరణ  కార్యక్రమంలో  చార్ మార్ శంకర్ (కోయిన్ని వెంకన్న), రాజకీయ విశ్లేషకులు అనంచిన్ని వెంకటేశ్వరావు, సామాజిక కార్యకర్త పాల్వంచ రామారావు, డాక్టర్ జి యస్ ఆర్ ఆంజనేయులు, బీ.వీ. రాఘవులు, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment