*_'జస్టిస్'కు జస్టిస్.!_*
_★ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్!_
_★ ముందే చెప్పిన వైనం_
_★ నాటి కుట్రను బహిరంగపర్చిన 'ఆదాబ్ హైదరాబాద్'_
*_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు అందించిన దమ్మున్న కథనం, 9440000009)_*
*_సెప్టెంబర్ 7, 2019న తెలుగు జర్నలిజంలో దమ్మున్న కథనాన్ని 'ఆదాబ్ హైదరాబాద్' ఆవిష్కరించింది. జస్టిస్ సంజయ్ కుమార్ పై జరిగిన అన్యాయం గురించి మూడు రోజుల పాటు హైకోర్టు న్యాయవాదులు కోర్టున బహిష్కరించారు. సామాన్యుల నుంచి న్యాయమూర్తి వరకు ఎవరికి ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించాల్సిన మీడియా గొంతు నాడు మూగబోయింది. ఒక్క 'ఆదాబ్ హైదరాబాద్' మినహా మిగిలిన మొత్తం మీడియా అస్సలు ఆ సంఘటన జరగనట్లే నటించాయి. రాజకీయుల అక్రమాల గురించి రాయటానికి భయపడే పరిస్థితుల్లో... ఏకంగా న్యాయస్థానం గురించి, న్యాయమూర్తుల గురించి 'న్యాయదేవత సాక్షిగా జస్టిస్ సంజయ్ పై కుట్ర' అంటూ ఓ సంచలన కథనం ప్రముఖంగా ప్రచురించింది. సుప్రీంకోర్టుకు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సహా అయిదుగురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయాలని కొలీజియం నిర్ణయించింది. ఇప్పుడు ఆ జస్టిస్ సంజయ్ కుమార్ కు 'న్యాయం' జరిగింది._*
*_అసలేం జరిగింది.?:_*
సుప్రీంకోర్టుకు తెలుగు వ్యక్తి జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ సహా అయిదు గురు న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేయాలని కొలీజియం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృ త్వంలో మంగళవారం సమావేశమైన కొలీజియం.. మణిపుర్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి(సీజే) జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, రాజస్థాన్ హైకోర్టు సీజే జస్టిస్ పంకజ్ మిత్తల్, పట్నా హైకోర్టు సీజే సంజయ్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ అసను ద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ పేర్లను సిఫారసు చేసింది. వీరిలో జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్ తెలంగాణకు చెందినవారు.
*_ఇదీ ప్రస్థానం:_*
1963 ఆగస్టు 14న హైదరాబాద్ లో జన్మించారు. నిజాం కళాశా లలో డిగ్రీ, దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రం అభ్యసించారు. సంజయ్ కుమార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఏపీ హైకోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గా పనిచేశారు.
*_న్యాయమూర్తిగా..:_*
2008 ఆగస్టు 8న ఉమ్మడి హైకో ర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబరు 14న పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణి పుర్ హైకోర్టు సీజేగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టుల నుంచి ప్రాతి నిధ్యం లేదు. న్యాయమూర్తిగా తెలుగువ్యక్తి జస్టిస్ పీఎస్ నరసింహ ఉన్నా.. ఆయన నేరుగా సుప్రీంకోర్టు బార్ నుంచి నియమితులయ్యారు. తెలంగాణ మాతృ హైకోర్టు నుంచి చివరిసారిగా జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయన పదవీ అనంతరం తాజాగా జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ పేరును కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో ఉన్న పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా కొద్దికాలంపాటు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు. సుప్రీంకోర్టులో 34మంది న్యాయమూర్తులు పనిచేయడానికి అవకాశం ఉండగా.. ప్రస్తుతం 28 మంది ఉన్నారు. కొలీజియం సిఫారసు చేసిన అయిదుగురి నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తే జడ్జీల సంఖ్య 33కి చేరు తుంది. కాగా, పీవీ సంజయ్ కుమార్ తండ్రి రామచంద్రా రెడ్డిది చిత్తూరు జిల్లా. వృత్తిరీత్యా హైదరాబాద్లో స్థిరప డ్డారు. 1969 నుంచి 1983 వరకూ సుదీర్ఘకాలం అడ్వకేటుగా సేవలందించారు.
బాక్స్:
*ఆనాడు ఏం జరిగింది.?*
(నాటి 'ఆదాబ్ హైదరాబాద్' కథనం యధాతథంగా..)
న్యాయదేవత సాక్షిగా...
జస్టిస్ సంజయ్ పై కుట్ర..!
◆ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఆందోళనలు
◆ బదిలీ వెనుక ఏం జరిగింది..?
◆ మరోవైపు 'సామాజిక' పంచాయతీ
*_(హిస్టరీలో మిస్టరీ కథనాలు-15)_*
(అనంచిన్ని వెంకటేశ్వరరావు ఆదాబ్ హైదరాబాద్)
*_సాక్షాత్తూ న్యాయదేవత చెంతనే ఓ అన్యాయం జరుగుతోంది. న్యాయస్థానాలలో వాదించాల్సిన న్యాయవాదులు రోడ్లు ఎక్కుతున్నారు. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 'అక్కడ ఏం జరుగుతుంది' అంటే అందరికీ తెలుసు. అయితే 'అసలు విషయం' గురించి బహిరంగంగా మాట్లాడాలంటే నిశ్శబ్ద భయం. కానీ.. కానీ.. ఫోర్త్ ఎస్టేట్ లో ఎవరూ మాట్లాడడానికి సాహసించని ఆ అసలు నిశ్శబ్ద విషయాన్ని... 'ఆదాబ్ హైదరాబాద్' సగౌరవంగా.. సగర్వంగా, సవివరంగా నిశ్శబ్దాన్ని పటాపంచలు చేయాలని భావించి ఇస్తున్న 'సంచలన పరిశోధన కథనం' మీకోసం ప్రత్యేకం._*
*అసలేం జరిగింది..:*
తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ ను పంజాబ్-హరియాణా కోర్టుకు బదిలీ అయ్యారు. ఆయన బదిలీని నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. విధులను బహిష్కరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, జిల్లాలోని న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. సంజయ్ కుమార్ ను తక్షణమే తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.
*బహిరంగ రహస్యం - భయంకర నిజం..?:*
జస్టిస్ సంజయ్ కుమార్ ది సాధారణ బదిలీ అయితే ఇంత పెద్ద ఎత్తున న్యాయవాదులు రోడ్లు ఎక్కి పోరాటం చేయరు. గత వారం రోజులుగా తెలంగాణ హైకోర్టుతో సహా జిల్లా న్యాయస్థానాలలో న్యాయపరమైన సేవలు నిలిచిపోయాయి. అందరికీ అన్నీ తెలుసు. ఎక్కడా.. బహిరంగంగా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనని ఓ రకమైన తెలియని భయం.
*ఆయనే చీఫ్ జస్టీస్..?:*
జస్టిస్ సంజయ్ కుమార్ తండ్రి అడ్వకేట్ జనరల్ గా సుమారు రెండు దశాబ్దాలు సేవలందించారు. ఆయన వారసత్వం పుణికి పుచ్చుకున్న జస్టిస్ సంజయ్ కుమార్ ఆగస్టు 14, 1963న జన్మించారు.1988లో నిజాం కాలేజీ చదువు, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో 'లా' పట్టభద్రుడయ్యాడు. అనంతరం ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా చేరారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఎన్నో సుధీర్ఘ కేసులపై విలక్షణమైన, నిక్కచ్చిగా తీర్పులు ఇచ్చారు. హైకోర్టు విభజన నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళి ఉంటే తప్పకుండా చీఫ్ జస్టీస్ అయ్యేవారు.! కానీ తెలంగాణ ప్రాతానికి చెందిన వాడు కావడంతో తెలంగాణలో ఉండాలని ఆయన భావించారు. ఆ మేరకే కట్టుబడి ఉన్నారు. తెలంగాణ హైకోర్టులో సీనియర్ జస్టీస్ గా కొనసాగుతున్నారు. ఇప్పుడున్న సీనియార్టీ ప్రకారం ఆయన చీఫ్ జస్టీస్ తర్వాత స్థానం ఆయనదే. అన్నీ అనుకున్నట్లు కొనసాగితే మరో రెండు, మూడు సంవత్సరాలలో ఆయన తెలంగాణ చీఫ్ జస్టిస్ అయ్యేవారు.
*తెర వెనుక ఏం జరిగింది..?:*
సుధీర్ఘ అనుభవం ఉన్న జస్టిస్ సంజయ్ కుమార్ కు వాస్తవంగా పదోన్నతి ఇచ్చి గౌరవించాలి. కానీ కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ హైకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ పివి.సంజయ్ కుమార్ ను పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని, కేంద్రాన్ని సిఫారసు చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల నిర్ణయించింది. కేంద్రం తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది. బదిలీ కారణంగా...జస్టిస్ సంజయ్ కుమార్ పంజాబ్, హర్యానా హైకోర్టు సీనియారిటీ జాబితాలో 12వ స్థానంలో ఉంటారు. అదేమిటో మొదట స్థానంలో ఉండాల్సిన ఆయన 12వ స్థానానికి చేరారు. ఇక్కడే ఏదో మతలబు జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
జస్టిస్ సంజయ్ కుమార్ కు మరో 12 ఏళ్ళు ఇంకా కొనసాగుతారు. అంటే తప్పకుండా సుప్రీంకోర్టులో ఆయన కీలకంగా కొనసాగే అవకాశం ఉంది. అంటే ఆయన పదోన్నతులను ఓ పక్కా పథకంతో దెబ్బకొట్టారని తెలుస్తోంది.
*ఇదే(0) నిరసన..:*
జస్టిస్ సంజయ్ కుమార్ బదిలీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో జస్టిస్ సంజయ్ కుమార్ ను పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేయడాన్ని ఖండిస్తూ అసాధారణ తీర్మానాన్ని ఆమోదించింది. అంతే కాకుండా ఏదైనా హైకోర్టులో అతన్ని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియాన్ని అసోసియేషన్ కోరింది. అయితే ఆశ్చర్యకరంగా జస్టీస్ సంజయ్ కుమార్ విషయంలో తెరవెనుక జరిగిన అసలు మతలబు గురించి ఎక్కడా పేర్కొనలేదు. ఎందుకు వెళ్ళలేదనే విషయం లోపలి అంచుల్లోకి 'ఆదాబ్' తొంగిచూడాలని భావించడం లేదు.
*చివరిగా..:*
హిస్టరీలో ఓ న్యాయమూర్తి కోసం రోడ్లపైకి న్యాయవాదులు ఇప్పటిదాకా రాలేదు. అంతేకాదు అందులో ఉన్న అసలు సమస్య గురించి బహిరంగంగా మాట్లాడలేక పోవడం ఓ మిస్టరీ.
----------------------
*హైకోర్టులో 'సమాజిక' ధర్నా..*
ఒకవైపు జస్టీస్ సంజయ్ కుమార్ వ్యవహారంపై ఆందోళనలు కొనసాగుతుండగా.. మరో వైపు సామాజిక న్యాయం పేరిట ఓ చిరు ఆందోళన జరిగింది. హైకోర్టు జడ్జీల నియమకాలలో బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ న్యాయవాదులను దామాషా ప్రకారం జడ్జీలుగా నియమించాలని 'బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సీనియర్ న్యాయవాదుల' పేరిట హైకోర్టు బయట ఆందోళన జరిగింది.
----------------------
*అంకితం:*
'హిస్టరీలో మిస్టరీ' 15 వరస కథనాలను ఆదరించిన పాఠకులకు ధన్యవాదాలు. ఈ కథనాలు మహనీయులు, భారతరత్న అబ్దుల్ కలాంకు అంకితం ఇస్తున్నాం.
No comments:
Post a Comment