Thursday, December 22, 2022

దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్దమా.?

*_ఎంపీ రంజిత్ రెడ్డిగారూ... భలే ఇరుక్కున్నారు సార్.!_*
_● రూ.150 కోట్ల కోళ్ల దాణా స్కాంలో బిగుస్తున్న ఉచ్చు..!_
_● 'ఫీడ్' ఇచ్చి లాక్కున్న భూములు ఎన్ని?_
_● 'నోవెల్ టెక్' పేరుతో 'వైట్‌' గా మారిన 'బ్లాక్ మనీ' ఎంత.?_
_● కుంభకోణాన్ని తిరగేస్తుంటే.. బయట పడుతున్న ఆగడాలు_
_● లంచాలతోనే అంగన్ వాడీ గుడ్లను మింగేస్తున్న వైనం_
_● పక్కా ఆధారాలతో వెలుగులోకి..!_
_● దమ్ముంటే బహిరంగ చర్చకు సిద్దమా.?_

Courtesy by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009 'తెలంగాణ వాచ్'కు ప్రత్యేకం)_*

*_పశుదాణా కుంభకోణం గతంలో దేశాన్ని ఓ ఊపు ఊపింది. ఇప్పుడు తాజాగా తెలంగాణ కేంద్రంగా 'కోళ్ళ దాణా స్కాం' వెలుగు చూసింది. ఇందులో ఏకంగా ఎంపీ రంజిత్ రెడ్డి పేరు బట్టబయలు కావడం గమనార్హం. ఒకప్పుడు 'కోళ్ల బిజినెస్' చేయాలంటే రైతులు భయపడే వారు. దరిద్రం ఏమిటంటే..కోళ్ళ వ్యాపారం కార్పొరేట్ స్థాయికి ఎదిగిన తర్వాత చిన్న, సన్న కారు రైతులను మింగేసి 'మాఫియా' గుత్తాధిపత్యం వహించింది. ఈ దరిద్రులు 'సర్కార్ నేరుగా దాణాకు ఇచ్చే సబ్సిడీ‌లో ...' రెండేళ్లలో ఏకంగా రూ.150 కోట్లు 'సిగ్ఢు, ఎగ్గు' లేకుండా బుక్కారు. చిన్న, సన్నకారు రైతుల నోట్లో మట్టి కొట్టి మరీ భూములను కొట్టేశారు. బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునేందుకు వందల కోట్లకు కంపెనీని అమ్మేశారని తెలుస్తోంది. ఇవన్నీ సరిపోవన్నట్లు... పేదోళ్ళకు సేవలందించే.. 'అంగన్‌ వాడీ గుడ్ల'పై కూడా పడ్డారు. 'కొత్త టెండర్ల' రూపంలో ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతున్నా పౌష్టికాహారం తగ్గించేలా 'కుట్ర'లు చేశారు. ఆ టెండర్స్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. దమ్ముంటే రండి బహిరంగ చర్చకు సిద్దం..! వచ్చే దమ్ముందా ర్రా.. దరిద్రుల్లారా..?_*

*_'కోళ్ళ దాణా స్కాం'కి ఎలా 'తెర' లేపారంటే..?:_*
గుడ్లు పెట్టే 'కోళ్ల లేయర్ ఫెడరేషన్' అధ్యక్షులుగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మాంసం కోసం పెంచే బాయిలర్ కోళ్ల 'బీడర్స్ అసోసియేషన్' అధ్యక్షుడిగా ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఉన్నారు. 10 వేల మంది కోళ్ల పెంపకం రైతుల కోసం మొక్క జొన్నలు కొనుగోలు చేసి సబ్సిడీ రూపంలో తక్కువ ధరకు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం స్కీం ప్రవేశ పెట్టింది. సబ్సిడీ ఎవరెవరకి ఇవ్వాలో...? ఫెడరేషన్, అసోసియేషన్ కే వదిలేసింది. (ఇదే అదనుగా భావించారామో..!)

*_3 కంపెనీలు..వంద కోట్లు:_*
దీంతో 8 లక్షల టన్నుల దాణాను సబ్సిడీ రూపంలో వీరికి ప్రభుత్వం అప్పగించింది. అయితే.. రైతులకు సబ్సిడీ ఇవ్వకుండా వారే తీసుకుని తమకు చెందిన ఫీడింగ్ మిల్లుల నుంచి మార్కెట్ రేటుకు అమ్ముకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సబ్సిడీ మొత్తం రూ.100 కోట్ల వరకు కేవలం మూడు కంపెనీలే కొట్టేశాయని తెలుస్తోంది. 2018 జూలై, అక్టోబర్, 2019 ఫిబ్రవరిలో మూడు ధపాలుగా దాణా తీసుకున్నారు. కిలోకు రూపాయలు 12, 14, 18 చొప్పున అప్పగించారు. మార్కెట్‌ లో రూ.27కు అమ్ముకున్నారు.

*_అవే నాలుగు కంపెనీలకు 60 శాతం దాణా!:_*
స్నేహా చికెన్ రాంరెడ్డికి చెందిన కంపెనీ 1,25,000ల టన్నుల దాణా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన పెంచిన కోళ్ల సంఖ్య 12 లక్షలకు మించి ఉండవని పలువురు చర్చించుకుంటున్నారు.

*_బరి తెగించి మరీ..:_*
రంజిత్ రెడ్డికి చెందిన శ్రీ రాజేశ్వర ఫామ్స్ 55 వేల టన్నులు,నోవల్ టెక్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 44 టన్నుల దాణా తీసుకున్నట్టు సమాచారం. ఆయన పెంచే కోళ్లు, లీజులిచ్చిన ఫామ్స్ అన్నీ కలుపుకున్నా 15 లక్షలు దాటవని తెలుస్తోంది. నేరుగా పెంచే కోళ్లు రెండున్నర లక్షలు మాత్రమే ఉంటాయని అంటున్నారు. మరో కంపెనీ మధుసూదన్ రావుకు చెందిన 'విమల ఫీడ్స్' మరో లక్ష టన్నులు తీసుకున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటి కంటే దేశంలోనే అత్యంత పెద్ద కంపెనీ అయిన, కోటి కోళ్లను ఉత్పత్తి చేసే వెంకటేశ్వర మాత్రం 60 వేల టన్నులే తీసుకుంది. దీనితో పాటు వెంకటరమణ పౌల్ట్రీ, లక్ష్మీ నరసింహా పౌల్ట్రీలు ఎక్కువ కోళ్లను పెంచుతారని పేరుంది. కానీ, వారికి అతి తక్కువగా దాణా ఇచ్చినట్టు సమాచారం. మరో 6 వేల మంది రైతులకు అసలు దాణానే అందించలేదు. దీన్ని వారికి చెందిన ప్రైవేట్ కమర్షియల్ ఫీడ్ కంపెనీకి తరలించుకుని అమ్మేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

*_2 లక్షల టన్నులకు సబ్సిడీ మాయం:_*
ఈ మొత్తం వ్యవహారంలో సుమారు 2 లక్షల టన్నులకు సబ్సిడీని మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క టన్నుకు 9 వేల రూపాయల సబ్సిడీ చెల్లిస్తోంది ప్రభుత్వం. మార్కెట్‌ లో 12వేల రూపాయలకు ఎక్కువగా వారు అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అంటే రూ.240 కోట్ల స్కాంకి తెరలేపారన్నమాట. ఇందులో వివిధ ఖర్చులు తీసివేసినా రూ.160 కోట్ల స్కాం బయటపడింది.

*_'నోవల్ టెక్‌'తో 'బ్లాక్ టు వైట్' నాటకాలు!_*
ఎంపీ రంజిత్ రెడ్డి జీవితంలో అతి పెద్ద డీల్ గా 'రోహిణీ మినరల్స్ కంపెనీ' క్రయ విక్రయాలను పలువురు చెబుతున్నారు. అమెరికాకు చెందిన సంస్థకు తన రోహిణీ కంపెనీని అమ్మేశారు. ఇండియా మార్కెట్‌ లో రూ.150 కోట్ల విలువ దాటని కంపెనీని రూ.600 కోట్లకు అమ్మేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. కిక్ బ్యాక్ ద్వారా ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మళ్లీ అడ్వైజర్ డైరెక్టర్‌ గా ఉండాలని సూచించారు. 10 ఏండ్ల వరకు మరో ఫీడ్ కంపెనీ పెట్టొద్దని షరతులు ఉన్నట్లు సమాచారం.

*_'సత్తా' చూపిన రూటు డిఫరెంట్:_*
వీటన్నింటినీ తుంగలో తొక్కి మళ్లీ ఎస్ఆర్ ఫీడ్ ని నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ అదే కంపెనీ కొనుగోలుకు బేరసారాలు నడిచాయని సమాచారం. ఎంతో ఖర్చు పెట్టి అభివృద్ధి చేసిన కంపెనీని రూ.250 నుంచి 300 కోట్లకు విక్రయించేలా సంప్రదింపులు జరిగినట్లుగా చెబుతున్నారు. అంటే రూ.300 కోట్ల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపై ఫిర్యాదులు అందుతున్నట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా క్రయ విక్రయాల వివరాలను 'తెలంగాణ వాచ్' సంపాదించింది.

*_రైతుల భూములను మింగిన ఫీడ్ కంపెనీలు!:_*
వ్యవసాయంలో రైతుల భూములను వడ్డీ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు కోళ్లకు దాణా సప్లై చేసి ఆ భూములను లాక్కున్న కంపెనీలూ ఉన్నాయి. అందుకు ఎంపీ రంజిత్ రెడ్డి కంపెనీలే ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు. సబ్సిడీలు ఇవ్వండి అంటూ రైతుల పేర్లు చెప్పి చిన్న రైతులను మింగేశారని, ఆ భూముల విలువకు సమానమైన ఫీడ్ అమ్మకం జరిపి ఆ తర్వాత లాక్కున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. షాద్ నగర్‌ లోని చోల్లపల్లిలో, కందుకూర్ లోని గుమ్మడెల్లీ, మాల్, తూప్రాన్ వద్ద ఖరీదైన భూములను ఇట్లే కాజేశారని, తాజా మార్కెట్ విలువ ప్రకారం వారికి భూమి మిగిలి ఉంటే ఎంతో లాభం జరిగేదని రైతులు చర్చించుకుంటున్నారు. కానీ, ఆ భూములపై కన్నేసి రైతులకు నష్టం వాటిల్లేలా చేశారు. సుమారు 500 ఎకరాలు వారి కుటుంబ సభ్యుల పేరిట భూములు ఉన్నాయంటే కోళ్ల వ్యాపారం ఎలా చేశారో అర్ధమవుతోంది.

బాక్స్:
*_'తొలివెలుగు తెలియదట..!' అవునా..?:_*
దాణా స్కాం బయటపడిన తర్వాత గుడ్ల టెండర్స్ స్కాంను మొదట 'తొలివెలుగు' వెలుగులోకి తెచ్చింది. ఈ టెండర్స్ గోల్ మాల్‌ లో ఓ మహిళా మంత్రికి ఫిబ్రవరిలో రూ.70 లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎంపీకి చీకటి ఒప్పందాలు ఉన్నట్లు తెలిసింది. దీనిపై 'తొలివెలుగు క్రైంబ్యూరో' వివరణ కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. నిర్వహకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. 'ఏం రాసుకుంటారో రాసుకోండి.. అసలు తొలివెలుగు ఎక్కడ ఉందో తెలియదని.. తనను ఎమీ అడగవద్దు' అని ఎంపీ సెలవిచ్చారు. వివరణ ఇవ్వటం కూడా 'రాకుంటే ఎలా..?' అని ఈ సారుకు ఎవరు చెప్పాలి.?

No comments:

Post a Comment