*తెలంగాణ కొత్త ఇంచార్జ్ డీజీపీ గా అంజనీ కుమార్....!*
హైదరాబాద్:తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీకుమార్ ((Anjani Kumar)) నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ను సీఐడీ చీఫ్‌గా, రాచకొండ సీపీగా దేవేంద్ర సింగ్ చౌహాన్, ఏసీబీ డీజీగా రవిగుప్త, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్‌కుమార్ జైన్ నియమితులయ్యారు.తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పదవి కాలం ఈనెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తరవాత డీజీపీ(DGP) ఎవరనే దానిపై నెలకొన్న ఉత్కంఠ వీడినట్లైంది.
1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన అంజనీ కుమార్ ఇప్పటిదాకా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరక్టర్ జనరల్‌గా ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. అడిషనల్ డీజీపీగా కూడా వ్యవహరించారు. డీజీపీ మహేందర్ రెడ్డి గతంలో కొన్ని వారాల పాటు మెడికల్ లీవ్ పెట్టినప్పుడు అంజనీ కుమార్ ఇంఛార్జ్ డీజీపీగా పనిచేశారు కూడా.
జితేందర్ గతంలో హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అడిషనల్ సీపీగా పని చేశారు. ఇప్పటివరకూ శాంతి భద్రతల అడిషనల్ డీజీగా పని చేశారు.
1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్తా గతంలో ఆయన డీఐజీ, ఐజీగా పనిచేశారు.
*సుజీవన్ వావిలాల🖋️*
No comments:
Post a Comment