Thursday, December 24, 2020

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు మార్గదర్శకాలు*

హైదరాబాద్ : 24/12/2020

*జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు మార్గదర్శకాలు*

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ప్రస్తుత పాలక మండలి పదవీ కాలం జనవరి 10వ తేదీతో ముగియనుంది. *91 సెక్షన్ ప్రకారం మొదటిసారిగా పాలక మండలి సమావేశంలోనే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఈసీ పేర్కొంది*.

*సెక్షన్ 88డీ ప్రకారం.. గెలిచిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా ప్రకటించిన నెల రోజుల లోపే మొదటి పాలక మండలి సమావేశం జరగాలని ఈసీ మార్గదర్శకాలలో పేర్కొన్నారు*. పాలక మండలి సమావేశం జరిగిన నాటి నుంచి ఆ కార్పొరేటర్ల పదవీ కాలం 5 సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. కాగా, జనవరి 10 తరువాత తాజాగా గెలిచిన అభ్యర్థులను కార్పొరేటర్లుగా ప్రకటిస్తూ ఈసీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

*link Media*

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment