హైదరాబాద్ : 02/12/2020
*ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది*
*తెలంగాణ సాధించుకోవడానికి అమరులైన అమరవీరుల ఆత్మలు ఎంత ఘోషస్తున్నాయో 😔!!!*
*తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సర్ గారు మరియు GHMC దత్తత మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు సర్ గారు తెలంగాణ ఉద్యమం అంటే ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా చేశారు అమరులైన అమరవీరులు. అలాంటి చారిత్రాత్మక ఉద్యమంలో మీరు పాల్గొన్నారు కదా మరి మీరు ఉద్యమకారులు అయివుండి GHMC ఎన్నికలు - 2020 లో మీ అభ్యర్థుల గెలుపుకోసం ప్రజాస్వామ్యాన్ని ఎందుకు అపహాస్యం చేశారు ??. ప్రభుత్వ యంత్రాంగాన్ని విచ్చాలవిడిగా దూర్వినియోగం చేశారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యలు సోషల్ మీడియా. సోషల్ మీడియా లేకపోతే సామాన్య ప్రజలకు వాస్తవాలు తెలిసేవి కావు. ఎందుకు సర్ ఇలా చేశారు ??. భారత రాజ్యాంగం కల్పించిన న్యాయమైన హక్కులకు అనుగుణంగా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అంటే మీకు భారత రాజ్యాంగం మీద గౌరవం లేదా అని అడుగుతున్నాను ??. సర్ ప్రజా ఉద్యమాలు అంటే ప్రజలకు అభివృద్ధి జరుగుతుంది అని అనుకున్నాము. కానీ న్యాయమైన హక్కులకోసం ఉద్యమాలు చేసిన వారికి తగిన గుణపాఠం నేర్పించారు మీరు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేసిన ఉద్యమకారులకు మీరు ఎందుకు అభ్యర్థులుగా ప్రకటించలేదు ??. మీరు తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు ఎన్ని వాగ్దానాలు & హామీలు చేశారు... వాటికి సంబందించిన వీడియోలు & వార్తపత్రికల వాస్తవ కథనాలు సోషల్ మీడియా లో వచ్చాయి తెలంగాణ ప్రజలు అన్నీ చూసారు.మరి ఇప్పుడు ఏమో నేను ఏమి చెప్పలేదు అని అనడం ఎంతవరకు కరెక్ట్ మీ అంతరాత్మతో మీరే ప్రశ్నించుకోవాలి!!.సర్ చివరగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటి అంటే తెలంగాణ ఉద్యమంలో మీతో వెన్నంటి నడిచిన ఉద్యమకారులను ప్రస్తుతం అసలైన వారిని మీరు దూరం చేశారో వారికి న్యాయం చేయండి. వారే తెలంగాణ నిరుద్యోగులు !!.*
*గెలుపోటములు శాశ్వతంకాదు అని ప్రజా సంకల్పం & link Media ద్వారా ఈసందర్బంగా తెలియచేస్తున్నాను 🙏*
*ప్రజాస్వామ్యాన్ని బతికిద్దాం..కాపాడుదాం... ఇదే మా సంకల్పం*
*ఇట్లు*
బాపట్ల కృష్ణమోహన్
prajasankalpam@gmail.com
@Praja_Snklpm (ట్విట్టర్)
prj_snklpm9456 (ఇంస్టాగ్రామ్)
prajasankalpam1 (యూట్యూబ్)
https://prajasankalpam1.blogspot.com/
No comments:
Post a Comment