Tuesday, December 8, 2020

Registrations In Dharani Portal In Telangana

హైదరాబాద్ : 08/12/2020

*Registrations In Dharani Portal In Telangana :* తెలంగాణలో పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చునని రాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చింది. అదే సమయంలో ఇటీవల ప్రారంభమైన ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగించింది. డిసెంబర్ 10వ తేదీ వరకు వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ల అంశాన్ని తేల్చేందుకు తెలంగాణ హైకోర్టు మంగళవారం ధరణి పోర్టల్ (Dharani Portal)పై దాఖలైన పిటిషన్లను విచారించింది.

కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ కోరారు.

దీనిపై తెలంగాణ ప్రభుత్వం ధరణి జీవోల వివరాలతో పాటు పిటిషన్‌కు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల కారణంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని, మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేస్తే ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పనులు తిరిగి ప్రారంభించనున్నట్లు కోర్టుకు అడ్వకేట్ జనరల్ విన్నవించారు. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

@Znews మీడియా

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment