Tuesday, December 22, 2020

కొత్త కరోనా....తెలంగాణ సర్కార్ అలర్ట్!

హైదరాబాద్ : 22/12/2020

*కొత్త కరోనా....తెలంగాణ సర్కార్ అలర్ట్!*


*యూకే ప్రయాణికులను ట్రాక్* *చేస్తున్నాం*
*విందులు, వినోదాలకు* *దూరంగా ఉండాలి*
*పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు*
బ్రిటన్‌లో కరోనా తీవ్రరూపం దాల్చడంతో తెలంగాణ అప్రమత్తమైంది. యూకే ప్రయాణికులను ట్రాక్ చేస్తున్నామని, వారం రోజుల్లో యూకే నుంచి 358 మంది వచ్చినట్టు గుర్తించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. యూకే నుంచి వచ్చిన వారు సమాచారం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. నిన్న యూకే నుంచి వచ్చిన వారికి టెస్టులు చేశామని, గత వారం రోజులుగా వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు.
సౌదీ అరేబియా సహా కొన్ని దేశాలకు కొత్త వైరస్ సోకిందని.. తెలంగాణలో ఇప్పటి వరకు కొత్త వైరస్ లేదని తెలిపారు. కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోందని.. మరణాలు, తీవ్ర లక్షణాలు మాత్రం చాలా స్వల్పంగా ఉన్నాయని పేర్కొన్నారు. కొత్త వేరియంట్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. *విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని, క్రిస్మస్‌, న్యూఇయర్ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు*. నాలుగైదు వారాల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని ఆయన వెల్లడించారు

*link Media*

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment