*పత్రిక ప్రచురణార్థం*
*తేది:18:03:2025*
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త లో ఫిర్యాదు చేసిన *బీఎస్పీ మేడ్చల్ మాజీ జిల్లా అధ్యక్షులు ఇటికాల అంబేద్కర్* సామాజిక కార్యకర్త *కొల్తూరి మనోహర్.*
పిజ్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఈరోజు బషీర్బాగ్ లోని తెలంగాణ రాష్ట్ర లోకాయుక్త లో ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పురపాలికల చట్టం 2019కి పూర్తి విరుద్ధంగా రెసిడెన్షియల్ అనుమతులు పొందుతూ భారీ కమర్షియల్ బిల్డింగుల నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.
ఈ అక్రమ నిర్మాణాలపై స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి, టౌన్ ప్లానింగ్ మరియు సంబధిత అధికారులకు వందల సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం తో ఈ రోజు తెలంగాణ లోకాయుక్త లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఉద్యోగ బాధ్యతా మరిచి ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు జవాబు దారిగా ఉండాల్సిన అధికారులు ప్రజలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా నోటీసుల పేరుతో కాలయాపన చేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు.
అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ కాంప్లెక్స్ లు, భారీ సెల్లార్ లు, అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే తనకున్న విచక్షణ అధికారం ఉపయోగించి తొలగించాల్సిన కమీషనర్ నోటీసులు ఇచ్చామని చెపుతూ కాలయాపన చేస్తూ అక్రమార్కులకు పరోక్షంగా సహకరిస్తున్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారి గారు పూర్తిగా తన ఉద్యోగ బాధ్యత మరిచి వ్యవహరిస్తున్నారు.
సెల్లార్ ల పై పిర్యాదులు వస్తే అక్రమ సెల్లార్ నిర్మాణాల దగ్గరికి వెళ్లి పిర్యాదులు వస్తానే ఉంటాయి, మీ పని మీరు చేసుకోండి నా కమిషన్లు నాకివ్వండి అని బహిరంగంగా పెద్ద మొత్తంలో కమిషన్లు తీసుకుంటూ అక్రమార్కులకు సహకరిస్తున్నారు.
కనీస విద్య అర్హత లేని మరియు రాజకీయ నాయకులతో వారి ఫ్లెక్సీలలో దర్శనిస్తున్న వారి గురించి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది.
కమీషనర్ గారికి కనీసం పదవ తరగతి కూడ పాసవ్వని వారిని వార్డు ఆఫీసర్లు గా ఎందుకు కొనసాగిస్తున్నారని అడుగుతే నా ఇష్టం నాకు నచ్చినట్టు నాకు అనుకూలంగా ఉన్న వారిని కొనసాగిస్తానని పరోక్షంగా చెప్పుతున్నారు.
రాజకీయ నాయకులతో వారి అధికారిక పార్టీ ఆఫీస్ కి వెళ్లి వారితో ఫోటోలు దిగుతూ వారికి జేజేలు కొడుతూ వారి ఫ్లెక్సిలలో ఫోటోలు డిగిన వార్డు ఆఫీసర్ల యెుక్క వివరాలు ఆధారాలతో కమీషనర్ గారికి ఫిర్యాదు చేస్తే రాజకీయ నాయకుల మెప్పు కోసం మున్సిపల్ సిబ్బంది తొ ఫ్లెక్సీలు తొలగించేసి సదురు వార్డు ఆఫీసర్లను కొనసాగిస్తున్నారు.
సాలార్ జంగ్ కంచే లో చేసిన లే అవుట్ లో మాయమైన పార్కు స్థలాలు మరియు ఓపెన్ ల్యాండ్ విషయంలొ కూడ పూర్తి ఆధారాలతో కమీషనర్ గారికి ఫిర్యాదు చేస్తే రెండు నెలలు గడుస్తుంది కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దీనిపై కూడ పూర్తి వివరాల లే అవుట్ మరియు ఓపెన్ ల్యాండ్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాల ఫోటోలతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దొడ్డి దారిన ఇచ్చినా పరిమిషన్ మరియు ఇంటి నెంబర్ల వివరాలతో పైన పేర్కొన్న అన్ని విషయాల ను పక్క ఆధారాలతో ఈ రోజు గౌరవ తెలంగాణ లోకాయుక్త కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.
గత కొన్ని రోజులుగా చేసిన పిర్యాదులు పై నిన్న కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో ఈ అక్రమ సెల్లార్, అక్రమ నిర్మాణాలకు నోటీసులు ఇచ్చామని కార్పొరేషన్ అధికారులు గౌరవ కలెక్టర్ గారికి మాకు చూపించిన నోటిసులపై కూడ త్వరలో హై కోర్టు లో రిట్ పిటిషన్ కూడ దాకలు చేసి అవినీతి అధికారులను కోర్టు మెట్లు ఎక్కించి తీరుతామని తెలియజేశారు.
*****---*****---*****---*****---****-
https://youtu.be/ZfQPicanHfk?si=Ix9v94iAjeKobF7B
*_'ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది'_*
*_ప్రియతమ సీఎం రేవంత్ రెడ్డి సారు నేను రాజ్యాంగంను గౌరవించే #జర్నలిస్ట్ ను ప్రశ్నిస్తున్నాను ✊.... Bplkm✍️_*
*#TelanganaRising 🤔*
*_#Peerzadigudamuncipalcorporation 👉 rising in #corruption_*
*#IllegalConstructions*
*_పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతి అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి._*
*#RevanthreddyCM #MuncipalMinister*
*@TelanganaCMO @Bhatti_Mallu @TelanganaCS @PrlsecyMAUD @cdmatelangana @MC_Peerzadiguda @Collector_MDL @TelanganaACB @INCTelangana*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
https://x.com/Praja_Snklpm/status/1902232973615006191?t=PadaeRqGt_w1yFxagFCtUA&s=19
No comments:
Post a Comment