దుబాయ్: 06/03/2025
*_ప్రతిమ ఫౌండేషన్ లో శిక్షణ పొంది పల్లెటూరు నుంచి విదేశాలకు #తెలంగాణ బిడ్డ._*
*_యువత నిరుద్యోగం ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఒక ముఖ్యమైన ఆందోళన,ఎందుకంటే బాల్య నిరుద్యోగం సామాజిక సంఘర్షణ, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ప్రభావాలు …. వీటిని ఎలా ఆదిగమించాలో చూపి అందరికి ఆదర్శంగా నిలిచిన యువకెరటం ఆర్యన్ పొన్నం._*
*_నేటి కాలం లో నిరుద్యోగ యువతకు నెపుణ్య శిక్షణలు అవసరమే ..._*
*_"ప్రజాసంకల్పం మీడియాతో యువకెరటం ఆర్యన్ పొన్నం S/O సత్యం పొన్నం_*
*_జగిత్యాల: మెట్ పల్లి ప్రాంతము అమ్మక్కపేట్ గ్రామ శివారు లో చెన్ననేని విద్యాసాగర్ రావు (మహారాష్ట్ర మాజీ రాష్ర్టగవర్నర్) నిరుద్యోగ యువతకు వృత్తి, నైపుణ్యాలపై శిక్షణ అందించి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతిమ ఫౌండేషన్,2019 ఆగస్టు లో ఏర్పాటు చేశారు._*
*_చెన్ననేని విద్యాసాగర్ రావు జీ ఏర్పాటు చేసిన ఈ ఫౌండేషన్ ద్వారా శిక్షణ పొందిన ఎందరో యువకులు ఈరోజు వివిధ కంపెనీ (దేశ & విదేశాలలో )మంచి ఉద్యోగంలో స్థిరపడ్డారు. అందులో ఒకరు ఆర్యన్ పొన్నం.రావు జీ చేసిన మేలు మరువలేనిది.మంచి ఆలోచనల తో ఏర్పడిన ఈ శిక్షణ కేంద్రం యువకులకు పూల బాటనిచ్చింది.భవిష్యత్ లో మెట్పల్లి ప్రాంత యువకులకు పునాది ఈ ఫౌండేషన్._*
*_ఈ సందర్బంగా విద్యాసాగర్ రావు జి కి ధన్యవాదాలు తెలిపారు ఆర్యన్ పొన్నం S/O సత్యనారాయణ పొన్నం._*
*_ఆర్యన్ పొన్నం సక్సెస్ కు కారణాలు👇_*
*_ప్రతిమ ఫౌండేషన్ లో సోలార్ టెక్నీషియన్ గా శిక్షణ తీసుకొని టాటా స్ట్రైవ్ సర్టిఫికెట్ అందుకొని ,జగిత్యాల జిల్లా డిస్ట్రిబ్యూటర్ సోలార్ ఇన్స్టాలేషన్ (మెట్ పల్లి) లో సంవత్సరమున్నర కాలం పాటు సోలార్ ఇన్స్టలేషన్ లో పని ఫీల్డ్ వర్క్ వివిధ గ్రామాల్లో చేసి,ఒక్క సంవత్సరము హైదరాబాదు లో పనిచేసిన అనుభవం తో యూఏఈ లో సందర్శక వీసా మీద వచ్చి దుబాయిలో పని కోసం వెతికితే మూడు రోజులు ట్రయల్ కూడా తీసుకున్నారు. Hansa enargy ఎనర్జీ సొల్యూషన్ లో, (Tata strive certificate) )ఉపయోగపడింది. గత సంవత్సరన్నర కాలముగా సోలార్ ఇన్స్టాలేషన్ టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్నారు.రానున్న రోజుల్లో దేశ విదేశాల్లో సోలర్ వినియోగం అత్యంత వాడకంలోకి రానున్నది. యువకులు తప్పకుండా నైపుణ్యం కలిగిన టెక్నికల్ పనులు నేర్చుకుంటే దేశ విదేశాల్లో మంచి ఉపాధి అవకాశం అని తన అనుభవాన్ని "ప్రజా సంకల్పం" న్యూస్ తో పంచుకున్నారు ఆర్యన్ పొన్నం._*
*_ఆర్యన్ తండ్రి సత్యం పొన్నం దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నారు. తను Dubai (WTC)(UAE Telugu Helping Hands organisation) లో సభ్యులు._*
*కలం యోధులు🪶*
*Bplkm✍️*
No comments:
Post a Comment