Tuesday, March 11, 2025

పరిగి నియోజకవర్గంలో నూతన మండలాలు, నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు గురించి రౌండ్ టేబుల్ సమావేశం... టీజేఏసి

*పరిగి మున్సిపాలిటీలో టీజేఏసీ మరియు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పరిగి నియోజకవర్గం నూతన రెవెన్యూ డివిజన్ గా మరియు పరిగి నియోజకవర్గంలో నూతన మండలాలు, నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు గురించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.*

 *టీ-జేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో  నియోజకవర్గంలోని పలు గ్రామాల ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది*

 *రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా ఈ క్రింది తీర్మానాలను ఆమోదించి ప్రభుత్వం త్వరితగతిన తగు చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది*

 *ప్రభుత్వం త్వరితగతిన పరిగి నియోజకవర్గాన్ని నూతన రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది*

 *పరిగి నియోజకవర్గంలోని ప్రస్తుతం ఉన్న మండలాలలో పరిపాలనా సౌలభ్యం కోసం అవకాశం ఉన్న గ్రామాలతో నూతన మండలాల ఏర్పాటులో భాగంగా ప్రస్తుత పూడూరు మండలంలో  కంకల్ నూతన మండలాన్ని, ప్రస్తుత చౌడపూర్ మండలంలో నూతన మరికల్ మండలాన్ని, దోమ మండలంలో నూతన దాదాపూర్-దిర్సంపల్లి మండలాన్ని, గండ్వీడ్ మండలంలో నూతన వెన్నచెడ్  మండలాన్ని అనువైన గ్రామాలతో ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.*

 *ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పాటుకు అవకాశం ఉన్న పూడూరు మండలంలోని మాటుగూడెం గ్రామాన్ని, పరిగి మండలంలోని బాబాపూర్ గ్రామాన్ని, దోమ మండలంలోని బడెంపల్లి పెద్ద తండా, ఊట్పల్లి పెద్ద తండా, గుండాల తండా, హుస్సేనాయక్ తండా లను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.*

 *తెలంగాణ ప్రభుత్వం పరిగిని రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడంతో పాటు నియోజకవర్గంలో అనువైన చోట నూతన మండలాలను నూతన గ్రామపంచాయతీలను ప్రజాభిప్రాయ సేకరణ మేరకు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.*

 *ఈ కార్యక్రమంలో జేఏసీ మరియు ప్రజా సంఘాల నాయకులు గోపాల్ రెడ్డి, పి గోవింద్ నాయక్,  ఎం ఎస్ భాను ప్రకాష్, పి నర్సిములు, ఎం వెంకట్రాములు,  ఎం రవీందర్, ఉప్పరి కృష్ణయ్య, మంగలి నారాయణ, రమేష్,   ఏ కృష్ణయ్య, ఎం వెంకటేష్ , ఎమ్ రమేష్, వి పాండు,  బి నర్సింలు,  సి సత్యయ్య, పి మల్లేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.*
Source :M S భాను ప్రకాష్ 

No comments:

Post a Comment