చెరువుల అభివృద్ధికి ఆటంకాలు తొలగిస్తాం
పరిసరాలను ఆహ్లాదంగా మార్చుతామన్న హైడ్రా కమిషనర్
---------------
హైదరాబాద్, మార్చి 06:
* చెరువుల అభివృద్ధిలో ఎక్కడా ఆటంకాలు లేకుండా చూస్తామని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు చెప్పారు.
* నగరంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనులకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని అన్నారు.
* కార్పొరేట్ సంస్థలు సీఎస్ ఆర్ నిధులను అందించి చెరువుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. అలాగే పరిసర ప్రాంతాల నివాసితుల్లో ఉన్నత వర్గాల వారు కూడా చేయూతనందించాలన్నారు.
* నానక్‌రామ్ గూడలోని ఖాజాగూడ పెద్ద చెరువుతో పాటు.. నెక్నాంపూర్‌లోని ఇబ్రహీంబాగ్ చెరువును హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
* ఖాజాగూడ చెరువు అభివృద్ధిలో తలెత్తిన ఇబ్బందులను ఈ సందర్భంగా అక్కడ పనులు చేపట్టిన ఎన్ ఎస్ ఎల్ ఇన్‌ఫ్రా, దివ్యశ్రీ ఇన్‌ఫ్రా ప్రతినిధులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.
* అక్కడికక్కడే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి.. చెరువులోకి మురుగు నీరు చేరకుండా కాలువ డైవర్షన్ పనులు చేపట్టాలని సూచించారు.
Courtesy / Source by :
#HYDRAA
No comments:
Post a Comment