Monday, March 31, 2025

400 acres of Land issue Facts



🚨FACT Check

KANCHA Gachibowli
400 acres of Land issue Facts 👇👇

1. ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానిదే...
2.  ప్రాజెక్టులో సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూమి లేదు.
3. ఆ భూమి య‌జ‌మాని తానేన‌ని న్యాయ‌స్థానం ద్వారా తెలంగాణ ప్ర‌భుత్వం నిరూపించుకుంది. ప్రైవేటు సంస్థ‌కు 21 ఏళ్ల కిత్రం కేటాయించిన‌ భూమిని న్యాయ‌పోరాటం ద్వారా ప్ర‌భుత్వం ద‌క్కించుకుంది.
4. వేలం... అభివృద్ధి ప‌నులు అక్క‌డ ఉన్న రాళ్లను  దెబ్బ‌తీయ‌వు..
5. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు (లేక్‌) లేదు....

ముఖ్యాంశాలు...

* రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలిలోని 400 ఎక‌రాలపై యాజ‌మాన్యం త‌న‌దేన‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేస్తోంది..
* 2004లో నాటి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక ప్రైవేటు సంస్థ‌కు ఈ భూమిని కేటాయించింది.
* దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులోని కేసుల్లో చ‌ట్ట‌ప‌రంగా గెల‌వ‌డం ద్వారా  తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆ భూమిపై యాజ‌మాన్యాన్ని ద‌క్కించుకుంది.
* ఆ భూమికి సంబంధించి సృష్టించే ఎటువంటి వివాద‌మైనా కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కు వ‌స్తుంది.
* స‌ర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ (సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ)ది కాద‌ని తేలింది..
* ఈ భూమిలో ప్ర‌భుత్వం చేప‌ట్టే అభివృద్ధి ప్ర‌ణాళిక‌లో ఏ చెరువు (లేక్‌) లేదు..
* కొత్త‌గా చేప‌డుతున్న అభివృద్ధి ప్ర‌ణాళిక‌ అక్క‌డ ఉన్న రాళ్ల రూపాలను (Rocks formation) దెబ్బ‌తీయ‌దు..
* ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌తి ప్ర‌ణాళిక‌లో స్థానిక సుస్థిరాభివృద్ధి... ప‌ర్యావ‌ర‌ణ అవ‌స‌రాల‌కు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తోంది.
* ప్ర‌స్తుత ప్రాజెక్ట్ ను వ్య‌తిరేకించే వారంతా  కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు, స్థిరాస్తి వ్యాపారుల‌ (రియ‌ల్ ఎస్టేట్‌) ప్ర‌యోజ‌నాల‌కు అనుగుణంగా విద్యార్థుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి గ్రామంలోని స‌ర్వే నంబ‌ర్  25 లోని 400 ఎక‌రాల భూమికి సంబంధించి కొన్ని మీడియా సంస్థ‌ల్లో వ‌చ్చిన త‌ప్పుదోవ ప‌ట్టించే క‌థ‌నాలు TGIIC దృష్టికి వ‌చ్చిన నేప‌థ్యంలో ఆ భూమికి సంబంధించిన వాస్త‌వాలు ప్ర‌జ‌ల ముందుంచుతున్నాం.

ఆ భూమికి సంబంధించిన చ‌ట్ట‌ప‌ర‌మైన అంశాలు

1. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కంచె గ‌చ్చిబౌలి గ్రామం స‌ర్వేనంబ‌ర్ 25లోని  400 ఎక‌రాల భూమిని 2004, జ‌న‌వ‌రి 13వ తేదీన నాటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం క్రీడా వ‌స‌తుల అభివృద్ధికి  ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్‌కు మెమో నంబ‌ర్ 39612/Assn/V(2) 2003 ప్ర‌కారం కేటాయించింది.
2. ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్ త‌న ప్రాజెక్టును ప్రారంభించ‌క‌పోవ‌డంతో 2006, న‌వంబ‌రు 21న నాటి రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో నెం: 111080/S1/2003 ప్ర‌కారం ఆ కేటాయింపును ర‌ద్దు చేసి ఏపీ యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం అండ్ క‌ల్చ‌ర‌ల్ డిపార్ట్‌మెంట్‌కు దానిని కేటాయించింది.
3. ఈ భూమి కేటాయింపుల‌పై ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్ గౌర‌వ హైకోర్టులో 2006లో రిట్ పిటిష‌న్ నంబ‌ర్ 24781/2006 దాఖ‌లు చేసింది. ఈ న్యాయ‌పోరాటం సుదీర్ఘ కాలం కొన‌సాగింది. రాష్ట్రంలో ఏర్ప‌డిన నూత‌న ప్ర‌భుత్వం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఈ కేసులో (రిట్ పిటిష‌న్ నంబ‌ర్ 24781/2006) గౌర‌వ హైకోర్టు ప్ర‌భుత్వానికి అనుకూలంగా 2024, మార్చి 7వ తేదీన ఉత్త‌ర్వులు ఇచ్చింది.
4. గౌర‌వ హైకోర్టు తీర్పును ఐఎంజీ అక‌డ‌మీస్ భార‌త ప్రైవేట్ లిమిటెడ్ గౌర‌వ సుప్రీంకోర్టులో  స్పెష‌ల్ లీవ్ పిటిష‌న్ (సీ) నంబ‌ర్ 9265/2024 ద్వారా స‌వాల్ చేసింది. ఈ పిటిష‌న్‌కు వ్య‌తిరేకంగా రాష్ట్ర ప్ర‌భుత్వం పోరాడింది. 2024, మే 3వ తేదీన గౌర‌వ సుప్రీంకోర్టు ఐఎంజీ అక‌డ‌మీస్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఆ 400 ఎక‌రాల భూమి ప్ర‌భుత్వానికి ద‌క్కింది.
5. టీజీఐఐసీ విజ్ఞ‌ప్తి మేర‌కు.. శేరిలింగంప‌ల్లి మండలం డిప్యూటీ క‌లెక్ట‌ర్ మ‌రియు త‌హ‌శీల్దార్ రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం కంచెగ‌చ్చిబౌలి స‌ర్వే నెంబ‌ర్ 25లోని 400 ఎక‌రాలు కంచ అస్త‌బ‌ల్ పోరంబోకు స‌ర్కారీ (అంటే... ప్ర‌భుత్వ భూమి అని) అని నిర్ధారించారు. ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికాకుండా త‌ర్వాత అభివృద్ధి ప‌నుల‌కుగానూ ఆ భూమిని స్వాధీనం చేసుకోవాల‌ని వారు సూచించారు.
6. 2022, సెప్టెంబ‌రు 14న జారీ చేసిన జీవో ఎం.ఎస్‌.నంబ‌ర్ 571, రెవెన్యూ (అస్సైన్‌-1) డిపార్ట్ మెంట్ ప్ర‌కారం భూ కేటాయింపుల‌కు సంబంధించిన కొత్త విధానం ఆధారంగా  కంచె గ‌చ్చిబౌలిలోని 400 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కొలిచి హ‌క్కులు బ‌దిలీ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం, ఐ అండ్ సీ విభాగం 2024, జూన్ 19న సూచించింది.

Courtesy/ Source by:

https://x.com/Congress4TS/status/1906625187925381405?t=FX61EP2mpchlEtP3JgY0YA&s=08

No comments:

Post a Comment