Sunday, November 5, 2023

కారెక్కనున్న "వావిలాల సుజీవన్"..!

*కారెక్కనున్న "వావిలాల సుజీవన్"..!*

*షాద్ నగర్ మున్సిపాలిటీలో మంచి పట్టున్న నేత*

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో షాద్ నగర్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీలోకి వలసల వెల్లువ కొనసాగుతూనే ఉంది. గతంలో షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి వెంట కీలక నేతగా ఉంటూ షాద్ నగర్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన సుజీవన్ నేడు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో  16 వార్డు క్రిస్టియన్ కాలనీలో పోటీ చేసి  2 వ స్థానంలో నిలవడంతో పాటు 18 వార్డులో యుగంధర్ ను ఇండిపెండెంట్ గా గెలిపించడంలో సుజీవన్ క్రియా శీల పాత్ర పోషించాడని చెప్పవచ్చు. అంతే కాదు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వన్నాడ లావణ్యను కౌన్సిలర్ గా  గెలిపించడంలో సుజీవన్ పాత్ర ఎంతో కీలకమని స్పష్టం చేయవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మల్లురవి, శంకర్ రావ్ లకు ముఖ్య అనుచరుడుగా ఉంటూనే గత 23 సంవత్సరాల నుండి  రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వెంట తనదైన ముద్ర వేసుకున్న నేత వాలిలాల సుజీవన్. కాంగ్రెస్ పార్టీలో కార్యక్తలకు కొందరు నాయకులు మొండిచేయి చూపించడంతో మనస్తాపానికి గురైన అనుచరుల కోరిక మేరకు బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీలో వావిలాల సుజీవన్ చేరిక మున్సిపల్ లో ఆ పార్టీ కి ఎంతో కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. రాజకీయ సుదీర్ఘ అనుభవం కలిగిన వావిలాల సుజీవన్ కు యువతలో మంచి క్రేజ్ ఉండటం పట్టణ బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపనుంది.

Courtesy / Source by : ప్రజల పక్షం 

No comments:

Post a Comment