*దళితుడిని సీఎం చేస్తాననీ కేసీఆర్ మాటతప్పాడు... మోదీ....!*
సీకింద్రాబాద్: పరేడ్ గ్రౌండ్స్‌లో ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయి. అధికారంలో వచ్చాక బీఆర్‌ఎస్ అందరినీ విస్మరించింది. ఎన్నో బలిదానాల తర్వాత తెలంగాణ ఏర్పడింది. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారు. దళితుల సీఎం కూర్చీని కేసీఆర్ కబ్జా చేశారు. మాదిగ సామాజికవర్గాన్ని కూడా విస్మరించారు. తెలంగాణ అస్థిత్వాన్ని బీఆర్‌ఎస్ కాపాడలేకపోయింది. దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదు. 3 ఎకరాల భూమి హామీని బీఆర్‌ఎస్ నిలబెట్టుకోలేదు. దళితబంధు పథకం వల్ల BRS నేతలకే మేలు జరిగింది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులు. ఆ రెండు పార్టీలతో దళితులు జాగ్రత్తగా ఉండాలి. కొత్త రాజ్యాంగం పేరుతో కేసీఆర్ అంబేద్కర్‌ని అవమానించారు. కాంగ్రెస్ అంబేద్కర్‌ను ఎన్నికల్లో రెండుసార్లు ఓడించారు. కాంగ్రెస్ పార్లమెంట్‌లో అంబేడ్కర్ చిత్రపటం కూడా పెట్టలేదు. అంబేద్కర్‌కు భారతరత్న కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు. మేం వచ్చాకే అంబేద్కర్ ఫొటో పెట్టాం.. భారతరత్న ఇచ్చాం. గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీదే.తెలంగాణ అస్తిత్వాన్ని BRS ప్రభుత్వం కాపాడలేకపోయింది." అని మోదీ విమర్శించారు.
"ఇరిగేషన్ స్కీంలను ఇరిగేషన్ స్కామ్‌లుగా మార్చారు. ఢిల్లీలో ఆప్‌తో కలిసి బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడింది. లిక్కర్ స్కామ్‌లో రెండు పార్టీల ప్రమేయం ఉంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అంటేనే అవినీతికి నిదర్శనం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలూ కలిసే ఉన్నాయి. ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్లు నటిస్తున్నారు. ఆ రెండు పార్టీల టార్గెట్ బీజేపీనే." అని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
*శ్రీనివాస్ MPR*
ప్రజల పక్షం
No comments:
Post a Comment