Posted by admin on 2023-11-21 02:25:45 | Last Updated by admin on 2023-11-21 03:10:59
మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో, ఆఫీస్ ల్లో ఐటీ సోదాలు.
బీజేపీలో ఉన్నన్ని రోజులు జరగని దాడులు.
హుజురాబాద్, మునుగోడు ఎన్నికలకు వందల కోట్లు ఇచ్చింది వివేక్ కంపనీయే.
భూములు తాకట్టు పెట్టుకుని ఎన్నికలకు డబ్బులు సర్దే వ్యాపారంలో వివేక్ దిట్ట.
ఈటలకు - వివేక్ చెడింది ఆ అగ్రిమెంట్ల వ్యవహారంలోనే.
కాంగ్రెస్ లోకి వెళ్లగానే ఐటీ , లోకల్ పోలీసుల దాడులు.
మంచిర్యాలలో 8 కోట్లు పట్టుకున్నవి ఆయన సొమ్మే.
కాంగ్రెస్ సొమ్ములను భయటకు తియకుండా అడుగడుగున అంక్షలు.
బీఆర్ఎస్ బినామి కంపనీ అయిన ఫినిక్స్ 2500 కోట్లు సర్దుబాటు
అయినా పత్తాలేని ఐటీ ,ఈడీ అధికారులు.
కాంగ్రెస్ నేతల టార్గెట్ గానే ఆదాయపు పన్నుశాఖ గురి
Courtesy / Source by : ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ బ్యూరో
9848070809
Devender Reddy
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆర్ధికంగా బలంగా ఉంటే వారి పై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి వివేక్ వెకంటస్వామి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయనకు సంబంధించిన కంపనీల పై అనుచరుల ఇళ్ల పై బంధువుల ఇండల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. 25 టీంలు పనిచేస్తున్నట్లు సమాచారం.
బీజేపీలో ఉంటే అన్ని మాఫి.
ఇదే వివేక్ వెంకటస్వామి మొన్నటి వరకు బీజేపీ లో కీలక నేతగా ఉన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో 50 కోట్లు ఇచ్చి భూములు వ్రాయించుకున్నారు. ఆ ఫండింగ్ కిరికిరి పై అప్పట్లో ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్ కథనాలు ఇచ్చింది. మరోవైపు మునుగోడు ఎన్నికల సమయంలో కోకాపేటలో 2.5 ఎకరాల భూమిని 140 కోట్లకు రాజగోపాల్ రెడ్డి వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఎన్నికల్లో డబ్బులు అఫిషియల్ గా కంపనీ నుంచి బదిలాయింపులు, నగదు రూపంలో అడ్జెస్ట్ చేయడంలో వివేక్ బరి తెగిస్తారు. అందులోనే బిజినెస్ కూడా వెతుక్కుంటారని అరోపణలు ఉన్నాయి.
No comments:
Post a Comment