Sunday, November 19, 2023

దొంగల బ్యాచ్...మానిఫెస్టో..

దొంగల బ్యాచ్...మానిఫెస్టో..



# కేసీయార్ మీద ఈగ వాలనివ్వని బీజేపీ
# అక్రమ సంబంధం బయటపడిన వేళ       


Courtesy / Source by :  (అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

'ఇద్దరూ దొంగలే' అంటూ కాంగ్రెస్, ఇతర పార్టీలు చేస్తున్న ఆరోపణలకు ఊతం ఇస్తూ... భాజపా విడుదల చేసిన మానిఫెస్టో.. ఆధారంగా ఈ కథనం. దయచేసి భాజాపాలోని నిబద్దత కలిగిన నాయకులు, కార్యకర్తలు తప్పక చదవండి.

అసలేం జరిగిందంటే..?:
ఈరోజు కూడా ఎక్కడో మాట్లాడుతూ అమిత్ షా కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీయార్‌ను చేరాయని ఆరోపించాడు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కూడా పదే పదే కాళేశ్వరం అవినీతి అంటారు.! అవన్నీ మాటల వరకే..! వాస్తవంగా కేసీయార్ మీద ఈగ కూడా వాలదు. వాలనివ్వరు.! కావాలంటే బీజేపీ మేనిఫెస్టోయే సరదాగా చూడండి.! దయచేసి వాళ్ళను అసహ్యంగా చూడకండి.

కాళేశ్వరం..టాటా:
ఆచరణలో ఏమీ ఉండకపోయినా సరే, అయ్యేది లేదు, పొయ్యేది లేదు. కనీసం కాంగ్రెస్ మేనిఫెస్టో కాళేశ్వరం అవినీతి మీద జుడిషియల్ ఎంక్వయిరీ వేస్తామంటోంది. కేసీయార్ తిన్న అవినీతి సొమ్మంతా కక్కించి మా గ్యారంటీ పథకాలకు ఖర్చుచేస్తాం అంటోంది.! కనీసం ఆ సీరియస్‌నెస్ కనిపిస్తోంది.! కానీ బీజేపీ..? (ఎందుకురా తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు..ఛీ..ఛీ)

గు....గు..ండెల్లో దుమ్ము లేదా..?:
మేనిఫెస్టోలో కుంగిన మేడిగడ్డ ఫోటో కూడా పెట్టారు. కానీ ఏమంటారంటే.! ‘‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజుల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికల నేపథ్యంలో ప్రాజెక్టును సమీక్షిస్తాం, సీడబ్ల్యూసీతో సంప్రదింపులు చేసి ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం.!’’ ఎక్కడా ఆ ప్రాజెక్టు అవినీతి మీద మాట లేదు.! పైగా పునరుద్ధరిస్తాట.! పెండింగ్ ప్రాజెక్టుల మీద ఏ ప్రస్తావన లేదు.! నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాల్నే తమిళనాడుకు తరలించుకుపోయే పన్నాగాలున్నాయి కదా.! దీనిపై సమగ్ర వివరణ లేదు.! పైగా గోదావరి మీద స్టెప్ అండ్ లేడర్ పద్ధతిలో బరాజులు, రిజర్వాయర్లు నిర్మిస్తారట.! అయ్యా, కేసీయార్ కట్టినవే తెలంగాణ సమాజం మీద మోయలేని భారాలయ్యాయి మహాప్రభో.!

ఏందిరా భయ్యా..ఇది:
విద్యుత్తు ప్రాజెక్టులు, డిస్కమ్స్ నష్టాల మీద మాటల్లేవు.! కీలకమైన చాలా అంశాల మీద ఏమీ లేదు.! పైగా ఏమున్నాయి..? అయోధ్య, కాశీలకు వయోవృద్ధులను ఉచితంగా తీసుకెళ్తారట.! అధికారంలోకి వచ్చే చాన్స్ అసాధ్యం కానీ కనీసం మేనిఫెస్టోనైనా జనరంజకంగా రాయొచ్చు కదా.! అదీ చేతకాలేదు. పైగా పర్‌ఫెక్ట్ హిందూ ముద్ర వేసుకునే ప్రయత్నమైతే కనిపించింది.

ఏం పీకటానికి..:
మతపరమైన రిజర్వేషన్లను (ముస్లిం రిజర్వేషన్లు) తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తారట.! ఓకే, హైదరాబాద్‌కు రాను రాను సంకటంగా మారుతున్న రోహింగ్యా వలసదారులపై దృష్టి పెడతామంటున్నారు.! కేసీయార్ వారి విషయంలో కూడా ఫ్లాప్.! ఏటా 4 సిలిండర్లు ఫ్రీ అన్నారు… సంతోషపడకండి. అవి కేవలం ఉజ్వల వినియోగదారులకు మాత్రమే. మోడీ మార్క్ ప్రజోపయోగానికి ఎప్పుడూ ఏదో కిరికిరి కంపల్సరీ. కరోనా వేళ చూశాం కదా, ఉచిత రేషన్ తప్ప ఇచ్చిందేమీ లేదు.

సాధ్యం కాని ..సోదులు ఎందుకు..?:
డీజిల్, పెట్రోల్ పై వ్యాట్ తగ్గిస్తామంటున్నారు.! కేంద్రమే ఓ నిర్ణయం తీసుకుని సెంట్రల్ ఎక్సయిజు తగ్గించొచ్చు కదా, వాళ్ల చేతుల్లో పని కదా.! అది మాత్రం చేయదు.! మహిళలకు ల్యాప్‌టాపులు సరే.! కానీ 10 లక్షల ఉద్యోగాలు అనేది సాధ్యమేనా..? ప్రైవేటు రంగంలో ఉద్యోగకల్పన ప్రభుత్వం చేతుల్లో ఏముంది..? ఏది తోస్తే అది రాసుకుంటూ పోయారు.! రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ, స్మారకాలకు ప్రయారిటీ అట. అనవసర విద్వేషాలకు శ్రీకారం మాత్రమే ఇది.!

ఉమ్మడి పౌరస్మృతికి కమిటీ అట.!:
అదేదో కేంద్రమే చేస్తోంది కదా, రాష్ట్రం చేయదగిందేముంటుంది..? సేమ్, హిందూ మార్క్ హామీ.! గోవధ మీద కఠినవైఖరి. వైద్యాశ్రీ, విద్యాశ్రీ పథకాల మీద, ఇళ్లస్థలాలు, ఇళ్ల మీద కూడా ఏదో ప్రస్తావనలే తప్ప నిర్మాణాత్మక వివరణలేమీ లేవు… బెల్టు షాపులు నిర్మూలిస్తాం, ప్రైవేటు స్కూళ్ల ఫీజులు నియంత్రిస్తాం వంటివి జస్ట్, కాగితాల్లో రాసుకోవడం కోసమే.! బీజేపీ చేసిందీ అదే.!

బీజేపీకి అధికార సీన్ లేదు.. కనీసం..:
సింగరేణి ఉద్యోగులకు ఆదాయపు పన్నురీయింబర్స్‌మెంట్ అట. వాళ్లకు మాత్రమే ఎందుకు..? ఎలాగూ గనుల ఆదాయంలో వాటా ఇస్తున్నారు కదా.! స్థూలంగా చూస్తే.! బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదు. కనీసం మేనిఫెస్టోనైనా 'నిర్మాణాత్మక రీతిలో రూపొందించొచ్చు కదా' అనిపిస్తోంది. అఫ్‌కోర్స్, మరీ బీఆర్ఎస్, కాంగ్రెస్ లాగా అలవిమాలిన వరాల జోలికి పోలేదు, గుడ్… అదే సమయంలో మేనిఫెస్టోలో ఎన్నికల పంచ్ కూడా లేదు. పైగా కేసీయార్ మీద ఈగవాలనివ్వని ధోరణి. దోస్త్ మేరా దోస్త్…!!

(ఇద్దరికీ సహజీవన అక్రమ సంబంధం ప్రాప్తిరస్తు..)

No comments:

Post a Comment