ఎంతకు అమ్ముడుపోయారు కలెక్టర్ గారు? నేను చాలా స్పష్టంగా వీడియో అప్లోడ్ చేసిన తేదీని నవంబర్ రెండుగా పేర్కొన్నాను కానీ నవంబర్ రెండు రోజు ఆ మీటింగ్ జరిగిందని చెప్పలేదుగా? కుల సంఘంతో ఆ మీటింగ్ జరిగింది నవంబర్ ఒకటో తారీకు, జరిగిన స్థలము జిఎంఆర్ ఫంక్షన్ హాల్, ఆ వీడియో లింకు క్లిక్ చేస్తే వచ్చే మెసేజ్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ వీడియో అభ్యర్థి తన ఫేస్బుక్ పేజీ నుంచి తొలగించాడు అని.
ఒక సాధారణ వ్యక్తిగా నేను ముందుగానే ఆ వీడియో ఫేస్బుక్ పేజీ నుంచి తొలగిస్తారని ఊహించి కాపీ చేసుకోవడం జరిగింది.
ఒక జిల్లా కలెక్టర్ అయ్యుండి ఎలక్షన్ కమిషన్ వారు నా ఫిర్యాదును పరిశీలించి ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఆదేశాలు ఇచ్చారని మరిచిపోయి అక్కడ మీటింగ్ ఏ జరగలేదు అని మీరు ఎలా సర్టిఫై చేస్తారు? నవంబర్ ఒకటో తారీకు సిసి కెమెరాల ఫుటేజీ తీయండి, అంతకు మునుపు ఆ తర్వాత కూడా వివిధ కుల సంఘాల మీటింగ్లు అదే ఫంక్షన్ హాల్ లో జరిగాయి ఇదే విధంగా హామీలు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగానే జరిగాయి, అవసరమైతే అందులో పాల్గొన్న వాళ్లు సాక్ష్యం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.
ఒక కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి జరిపే విచారణ ఏదైనా?
నేను డౌన్లోడ్ చేసిన వీడియో కాపీని నా గూగుల్ డ్రైవ్ లోకి కాపీ చేసి లింకు మీకు పంపించడం జరిగింది, మీకు నిజంగా ఈ అవినీతిలో భాగస్వామ్యం లేదు అంటే, అధికార పార్టీలో కుమ్మక్కు కాలేదు అనుకుంటే, తక్షణమే అభ్యర్థి పై చర్యలు తీసుకోండి.
ఆందోల్ నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి పైన కూడా తన ఆస్తులు ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేయలేదు అని స్పష్టమైన ఆధారంతో నేను ఫిర్యాదు చేశాను, కమిషన్ వారు పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకోమని మిమ్మల్ని ఆదేశించడం జరిగింది, అయినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు, దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు అధికార పార్టీతో కుమ్మక్క ఈ లంచాలకు దాసోహం అయ్యారని తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాలుగా అవినీతి, అరాచకం, లంచగొండితనం భూఆక్రమణలు విపరీతంగా పెరిగిపోవడం, జవాబుతారీతనం లేకపోవడానికి ప్రధాన కారణం మన జాతి రత్నాలైన కంఫర్ట్ ఐఏఎస్, ఐపీఎస్లు లే అనడంలో ఎటువంటి సందేహం లేదు, ఎందుకంటే తెలంగాణలో చాలా జిల్లాలకు ప్రధాన అధికారులుగా వీళ్లే ఉన్నారు.
ఎందుకంటే వీళ్ల లాయల్టీ మొత్తం వాళ్ళని ప్రమోట్ చేసిన వాళ్లపైనే తప్ప జీతాలు ఇచ్చే ప్రజల పైన కాదు ప్రమాణం చేసిన రాజ్యాంగం పైన కాదు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఐఏఎస్లు ఐపీఎస్లు నిజంగా నిజాయితీగా నిబద్ధతగా, మరియు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు అవినీతికి పాల్పడడం అసాధ్యం. #TelanganaElections2023 #TelanganaAssemblyElections2023 #TelanganaElections2023 @TelanganaCS @arvindkumar_ias @DrTamilisaiGuv @Praja_Snklpm
https://twitter.com/RaviVattem/status/1728258113508393359?t=wSiNyzlSvzdLrn7dg4q4zw&s=19
@RaviVattem వకీల్ సాబ్ మీరు చెప్పింది అక్షరాలా సత్యం 👍
#తెలంగాణ లో #IAS #IPS అధికారులు ప్రజాప్రయోజనాలకోసం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయడం లేదు. వీళ్ళు పాలకులకు, ప్రజాప్రతినిధులకు బానిసలుగా పనిచేస్తున్నారు.
Bplkm🪶
బాపట్ల కృష్ణమోహన్
ప్రజాసంకల్పం.
https://twitter.com/Praja_Snklpm/status/1728279853823365392?t=N1xpv06FfwR4b8_klg0WLQ&s=19
No comments:
Post a Comment