Monday, November 27, 2023

కుమ్ముడే కుమ్ముడు

కుమ్ముడే కుమ్ముడు



* 17 భారీ కుంభకోణాలు 
* 4 లక్షల కోట్లు.. 
* కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్..!

Courtesy / Source by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

తెలంగాణను కేసిఆర్ దోపిడీ చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ 17 రకాలు కుంభకోణాలు చేసిందంటూ..
వాటి విలువ 4 లక్షల 10వేల కోట్లుగా లెక్కలు కట్టి మరీ చూపి కేసీఆర్ అవినీతిపై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్ విడుదల చేసింది.

అవినీతి మయం అంటూ..:
కేసీఆర్ పాలన మొత్తం 'అవినీతి మయం' అంటూ  కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. ప్రజల కోసం అంటూ చేపట్టిన ప్రతి పనిలోను స్వలాభం చూసుకున్నారని ఆ పార్టీ ఎద్దేవా చేశారు

అధికారంలోకి రాగానే..:
బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో చోటు చేసుకున్న 17 కుంభకోణాల‌కు సంబంధించి విచార‌ణ చేప‌డ‌తామ‌ని కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. ఆ వెంటనే దోషుల‌ను గుర్తించి వారిని జైలుకు కూడా పంపిస్తామ‌ని పేర్కొంది.

బాక్స్:

జాబితాలో..
1). కాళేశ్వరం ప్రాజెక్టు: లక్ష కోట్ల రూపాయలు 
2). జీవో 111 రద్దు: 1 లక్ష 40 వేల కోట్లు
3). ధరణి పోర్టల్‌ : 50 వేల కోట్లు
4). పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు: రూ. 25వేల కోట్లు
5). హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ టోల్ వసూలు టెండర్లు: రూ. 22,620 కోట్లు
6).  మిషన్ భగీరథ: 21,600 కోట్లు
7). ఏఎంఆర్ కు తాటిచర్ల కోల్ బ్లాక్ మైనింగ్‌ను లీజు: రూ.16,000 కోట్లు
8). మిషన్ కాకతీయ: రూ.12,000 కోట్లు
9). హరితహారం: రూ.8,000 కోట్లు
10). ప్రతిమ సంస్థకు నిషేధిత భూమలు కట్టబెట్టిన వైనం: రూ.5,000 కోట్లు
11). ప్రైవేటు మెడికల్ కాలేజీల సీట్లలో అక్రమాలు: రూ.3,513కోట్లు
12). నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఆయన భూములు కబ్జా: రూ. 2,000 కోట్లు
13). హైదరాబాద్ షేక్‌పేటలో ప్రభుత్వ భూమిని అక్రమంగా ఓ హౌసింగ్ సొసైటీకి కేటాయించపు: రూ.1500 కోట్లు
14). దళితబంధులో కమీషన్లు: రూ.1,150 కోట్లు
15). మధుకాన్ గ్రూప్ బ్యాంక్‌ లోన్లు: రూ.1,064 కోట్లు
16). మార్క్‌ఫెడ్‌ మక్కల కొనుగోళ్లలో అవకతవకలు: రూ.1,000 కోట్లు
17).  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌: రూ.100 కోట్లు


No comments:

Post a Comment