Saturday, November 18, 2023

రూ.48 వేల కోట్లు మింగింది ఎవడ్రా..?

రూ.48 వేల కోట్లు మింగింది ఎవడ్రా..?



★  కాళేశ్వరం కాంట్రాక్టర్ ను పిలిచి ఆరా తీసిన అమిత్ షా.!
★ తెలంగాణ నేతలకు ముట్టింది మూడు వేల కోట్లట.!
★ ఈ ఎన్నికలకు రూ.400కోట్లు సర్థాడట.!
★ సిఏజి నివేదికలో ఎన్నో రహస్యాలు
★ అడిగిన దానికన్నా అదనంగా రూ.29 వేలు కోట్ల సర్దుబాటు
★  పని మొదలెట్టకుండానే మెఘా 'నొక్కుడు' కార్యం
★ చూపిన ప్రయోజనాలకు, వాస్తవాలకు మధ్య ఎంతో తేడా
★ డీపీఆర్ ఆమోదించిన ఖర్చు రూ.81,911 కోట్లు
★ తాజా అంచనా ప్రకారం రూ.1,49,317 కోట్లు
★ ఏడాది విద్యుత్తు ఖర్చే రూ.10వేల కోట్లు
★ ఎకరా నిర్వహణ వ్యయం రూ.46,364

Courtesy / Source by :

(అనంచిన్ని వెంకటేశ్వరావు, ఈ దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డుగ్రహీత, 9440000009)

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో కలిగే ప్రయోజనాలను ఎక్కువ చేసి చూపారు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయమూ గణనీయంగా పెరిగింది. కేంద్ర జలసంఘం ఆమోదించిన డీపీఆర్ ప్రకారం రూ.81,911 కోట్లు కాగా, తాజా అంచనా ప్రకారం రూ.1,49,317 కోట్లుగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్తులో 46.81% ఈ ఒక్క ప్రాజె క్టుకే అవసరం" అని కాళేశ్వరంపై ఏడాది కాలంగా అధ్యయనం చేస్తున్న 'కాగ్ తన తుది నివేదికలో పొందుపర్చిన విషయాలు.. ఇందులో  ఏకంగా రూ.48 వేల కోట్లు మెఘా కాంట్రాక్టర్ నొక్కేసిన వైనం 'సిఏజి నివేదిక' రూపంలో కేంద్రం చేతికి అందింది. 'తెలంగాణా వాచ్'కు విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ఆమోదించిన దాని కన్నా..:
ఎక్కడైనా, ఎవరైనా అడిగినంత ఇవ్వటమే కష్టం. అలాంటిది కాళేశ్వరం ప్రోజెక్ట్ విషయంలో ఏకంగా రూ. 29 వేల కోట్లు అదనంగా చెల్లించిన వైనం ఈ నివేదికలో ఉంది. 56వ పేజీలో 1లక్షా 2వేల 2కోట్ల 67లక్షల,మీ 99 వేలు విషయం చాలా స్పష్టంగా ఉంది. ( దొంగల్లార్రా జర ఆ పేజీ క్రాస్ చేసుకోగలరు).

డీపీఆర్ ప్రకారం రూ.81,911 కోట్లు:
"కాళేశ్వరం నుంచి ఎత్తిపోనే ఒక టీఎంసీ నీటితో 17,968 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని డీపీఆర్ లో రాశారు. కానీ, ఇతర ప్రాజెక్టుల్లో ఒక టీఎంసీతో 10 వేల ఎకరాలే చూపించారు. కాళేశ్వరం కింద 199 టీఎంసీలను సాగునీటి కోసం కేటాయించారు. ఆయక ట్టును పరిగణనలోకి తీసుకొంటే ఈ నీళ్లు ఖరీత్కే సరి పడవు. అంటే రబీకి నీళ్లుండవు. మత్స్య సంపద, పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుందని చూపించారు. విద్యుత్తు ఛార్జీలను యూనిట్ కు రూ.3 లెక్కగట్టారు. కానీ.. ఎత్తిపోతల పథకాలకు యూనిట్ ధర రూ.6.40గా ఉంది. ఖర్చు, లాభ నిష్పత్తి (కాస్ట్ బెనిఫిట్ రేషియో)ని 151గా పేర్కొన్నారు.

రూపాయి ఖర్చు- అర్థ రూపాయి ఆదాయం:
వాస్తవానికి అది 0.75 మాత్రమే తాజా వ్యయం రూ.1,49317 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే 052 మాత్రమే. అంటే ఒక రూపాయి ఖర్చు పెడితే 52 పైసల ప్రయోజనమే కలుగుతుంది. ఈ ఎత్తిపోతలకు 8.458.10 మెగావాట్ల విద్యుత్తు అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న విద్యుత్తులో ఇది 46.81%. ప్రాజెక్టు పూర్తయ్యాక ఏడాదికి 14.344.39 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అవసరం ఉంటుంది.

అదనపు టీఎంసీతో రూ.28,151 కోట్ల ఖర్చు:
ప్రాజెక్టు అంచనా వ్యయాన్నీ తక్కువ చేసి చూపిం చారు. మొదట రెండు టీఎంసీలతో చేపట్టినా తర్వాత కాగ్ నివేదిక ప్రకారం కాళేశ్వరం రూపాయి ఖర్చుకు 52 పైసల ప్రయోజనమే.!

రూ.28 కోట్ల అదనపు ఖర్చు:
మూడు టీఎంసీలకు పెంచారు. ఫలితంగా రూ.28 కోట్ల అదనపు ఖర్చు వచ్చింది. పాత ధరల అంచనా డీపీఆర్ తయారు చేశారు. తాజా నిర్మాణ వ్యయ పరిగణనలోకి తీసుకొంటే ప్రతి ఎకరాకు మామూలు వ్యయం(క్యాపిటల్ కాస్ట్) రూ.6.5 లక్షలు అవుతు ప్రతి సంవత్సరం విద్యుత్తు ఛార్జీలకు రూ.10,374 కోట్లు అవసరం. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అదనం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే నిర్వహణ ఖర్చు రూ.46,361లు. తుది 50 టీఎంసీలతో చేపట్టిన పనులలో మరికొన్ని సమస్యలున్నట్లు ఎన్ జీఆర్ (భూకంప ప్రభావంపై అధ్యయ శ్వరం కోసం రూ.87,919 కోట్ల రుణాం 7.8% నుంచి 10.9% వరకు తీసుకొన్నారు. శ్రీరామసాగర్ ఆయట్టులో 65.76 శాతానికి నుంచి నీటిని సరఫరా చేయాలని నిబంధన. అయితే వరదకాలువ నుంచి శ్రీరాంసాగర్ కు ఎత్తిపోసి మళ్లీ ఇదే నీటిని తీసి కాలువకు తేవడం సరైంది కాదు. ఈ పథకం కోసం రూ.1,999,569 ఖర్చు చేయడం సరైన చర్య కాదు' అని కాగ్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

బాక్స్:
మెగా కాంట్రాక్టర్ కాళేశ్వరం స్వాధీనం చేసుకున్నప్పుడే.. ఇందులో 'దోపిడీ' జరగనున్నదని తెలుస్తోంది. ఈ నివేదికలోని 17 కాలంలో రూ .327.63కోట్ల సంగతిలో అడ్డంగా దొరికారు. కాళేశ్వరం ఫిల్లర్ల భాగోతం ప్రకృతి బయట పెట్టగానే ఈ విషయంపై కేంద్రం స్పందించింది. వాళ్ళు జరిగిన లోపాలను ప్రస్థావించగానే... ఫిల్లర్ల కింద ఇసుక కొట్టుకుపోయిందని దిగజారిన మాటలు అధికారులు 'అధికార మదం'తో చెప్పారు.

రంగంలో అమిత్ షా:
ఈ ప్రోజెక్ట్ కు సంబంధించిన సిఏజి నివేదికలో ప్రస్తావించిన రూ.48 వేల కోట్ల గురించి మెఘా కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని పిలిపించి 'షా' ఆరా తీశారు. ఆయన ఎవరికీ ఎంత ముట్ట చెప్పింది చక్కగా వివరించారు. నివేదిక యథార్థమని కేంద్రం భావిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో అనేక బడా కాంట్రాక్టర్లు చేసిన ఆ వ్యక్తి తాజా ఎన్నికలకు సుమారు రూ‌400 కోట్లు అదనంగా సర్దుబాటు చేశారని కేంద్రం భావిస్తోంది.

బాక్స్ 2:

ఏందిరా మీ బాధ
కాళేశ్వరం ప్రోజెక్ట్ విషయంలో అవినీతి జరిగింది. ఇదే విషయంపై ఓ నివేదిక అందింది. ఆ నివేదికలో ఏం ఉంది.? కేంద్రం ఏం చేయబోతున్నదని భాద్యత గల జర్నలిస్టులుగా మా కర్తవ్యం అది. జోకుడుగాళ్ళు ఎలాగో మీ వెంటే ఉంటారు. మమ్మల్ని బెదిరించే ప్రయత్నాలు చేశారు. తాటాకు చప్పుళ్లకు మీం బెదరం. అది పింకీలకు ఇప్పటికే తెలుసు. మీకు రోజులు దగ్గర పడ్డాయి.

No comments:

Post a Comment