Thursday, November 9, 2023

_దగాకోర్ దయాకర్ రావు..!_

*_దగాకోర్ దయాకర్ రావు..!_*
_# మంత్రి ఎర్రబెల్లిపై కాంగ్రెస్ ఛార్జీషీట్_
_# పనేదైనా.. పథకమేదైనా.. 30% వాటా_
_# చెన్నూరు రిజర్వాయర్లో 250 కోట్లు కమిషన్_
_# అనర్హులకు దళిత బంధు_

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ ను చెడుగుడు ఆడుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ తర్వాత ఆయన పంచన చేరి ఏకంగా మంత్రి అయ్యారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుపై కాంగ్రెస్ పార్టీ చార్జీ షీట్ విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన చార్జీ షీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. 'దగా కోర్ దయాకర్ రావు' పనేదైనా, పథకమేదైనా, నా వాటా 30% అంటూ పేర్కొన్న తొమ్మిది ఆరోపణలతో కూడిన చార్జీ షీట్‌ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ఈ చార్జిషీట్ లో ఆయన తీసుకుంటున్న కమిషన్ కారణంగా ఆగిపోయిన పనులు, గత ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయని కార్యక్రమాలను ప్రస్తావించారు. 'దయాకర్ రావు అక్రమాలు' అంటూ ఆరోపణలు చేస్తూ చార్జి షీట్ విడుదల చేశారు. దందాల దయాకర్ రావుపైన పోరు చేద్దాం. పాలకుర్తి అసెంబ్లీని పరిరక్షించుకుందాం అంటూ' నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు._*

*https://telanganawatch.in/article.php?data=minister-dagakor-dayakar-rao*

*_చార్జిషీట్లో కాంగ్రెస్ పేర్కొన్న తొమ్మిది అంశాలు, ఆరోపణలు ఇలా ఉన్నాయి._*

*_చెన్నూరు రిజర్వాయర్లో 250 కోట్లు కమిషన్_*
పాలకుర్తి నియోజకవర్గం చెన్నూరు రిజర్వాయర్‌ను పూర్తి చేసేందుకు కాంగ్రెస్ రూ.360 కోట్లు కేటాయిస్తే, మంత్రి ఎర్రబెల్లి రూ.700 కోట్లకు పెంచి రూ.250 కోట్ల కమీషన్ కొట్టేసిండని ఆరోపించింది. కమీషన్లు అడుగుతుండటంతో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావట్లే అంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణ చేసింది. నియోజకవర్గంలో సర్వే నెం.76 ని 56 గా మార్చి గిరిజనుల 50 ఎకరాల భూమి కాజేసిండని విమర్శించింది. ఇలా ప్రతి మండలంలో 100 ఎకరాలు కూడబెట్టిండని ఆగ్రహం వ్యక్తం చేసింది.

*_పంచాయతీల పట్ల నిర్లక్ష్యం_*
నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలకు నిధులివ్వాలని సర్పంచులు వేడుకోగా మందు బాటిళ్లు అమ్ముకోండని మంత్రి అహంకారం చూపిస్తుండని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. మంత్రి ఎర్రబెల్లి కమీషన్ల కారణంగా తొర్రూర్ మండలంలో తాగునీటి ప్రాజెక్టుల పనులు ఆగినయని పేర్కొన్నారు. ప్రజలు తాగునీటి కోసం కటకటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

*_అనర్హులకు దళిత బంధు_*
అర్హులకు కాకుండా 30% కమీషన్ తో తన అనుచరులకే దళిత బంధు ఇచ్చిండని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. పాలకుర్తి మండలంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తనని మోసం చేసిండు. డిగ్రీ కళాశాల కట్టించకుండా దగా చేసిండని విమర్శించారు. రాయపర్తి మండలంలోని మంత్రి, అతని తమ్ముడి కోళ్ల ఫామ్ కారణంగా చెరువులు కలుషితమైతున్నాయి. మత్స్యకారులు, ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని పేర్కొంది. మంత్రి దౌర్జన్యాలను ప్రశ్నిస్తే పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అధికారమదంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండని విమర్శించింది. 

*_పూర్తిగానీ డబుల్ బెడ్రూం ఇండ్లు:_*
2018లో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేసి ఇప్పటి వరకు పూర్తి చేయలేదని ఆవేదనవ్యక్తం చేసింది. మంచుప్పులలో దళితులకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లు అధ్వానంగా ఉన్నాయని కాంగ్రెస్ పేర్కొంది. కొడకండ్ల మండలంలో టెక్స్ట్  టైల్ పార్కు నిర్మిస్తానని, సంఘం సభ్యులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిండా ముంచిండని ఆ‌రోపించారు. దయాకర్ రావు నుంచి పాలకుర్తి నియోజకవర్గం కాపాడుకునేందుకు సిద్ధం.

No comments:

Post a Comment