Friday, November 10, 2023

ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి

ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నగరాల్లో నివసించే చదువుకున్న మేధావులకి నా విజ్ఞప్తి, దయచేసి ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి తద్వారా మీరు ఒక సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో భాగస్వాములు కాగలుగుతారు, కొంతమంది చదువుకున్న మూర్ఖులు అతి తెలివి ప్రదర్శిస్తూ మనకెందుకులే ఎవరు అధికారంలోకి వచ్చినా మనకు చేసేది ఏమీ లేదు అని ఓటు వేయకపోవడం లేదా నోట ప్రెస్ చేయడము చేస్తుంటారు అలా చేయడం వలన మిగతా ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది ఎందుకంటే సరైన నాయకుడిని ఎన్నుకోలేక పోతారు, ఎవరూ సరిగా లేనప్పుడు ఉన్నవాళ్లలో ఎవరు బెటర్ అని ఆలోచించి వారికి ఓటు వేయండి కానీ ఓటు హక్కును మాత్రం కచ్చితంగా ఉపయోగించుకోండి మీకు వ్యక్తిగతంగా ఎవరు ఏం చేసినా చేయకపోయినా మీ నియోజకవర్గానికి రాష్ట్రానికి దేశానికి అన్యాయం చేసే వాళ్ళని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో మీ పాత్రను మీరు పోషించగలుగుతారు.
వీ రవికృష్ణ
సామాజిక కార్యకర్త
న్యాయవాది.
#TelanganaElections2023 #TelanganaAssemblyElections2023 #Telangana #Hyderabad #Sangareddy #Patancheru #BRSParty #Congress #BJP #BSP #Election2023
*****---*****--=*****---*****---*****
భూకబ్జాదారులకు రియల్ ఎస్టేట్ మాఫియాకు మైనింగ్ మాఫియాకు చెరువులను కుంటలను నాలాలను కబ్జా చేసి సహజ వనరులతో ప్రకృతితో చెలగాటమాడుతున్న అక్రమార్కులకు వెన్నుదన్నుగా నిలిచినా నిలుస్తున్న నాయకులకు ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన విధంగా ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
వి. రవికృష్ణ
న్యాయవాది
సామాజిక కార్యకర్త.
#Lakdaram #Sangareddy #Patancheru #TelanganaElections2023 #TelanganaAssemblyElections2023 #Telangana #Hyderabad #Rangareddy #Shankarhills #Kesara #Ameenpur #BRSParty #Congress #BJP #BSP

No comments:

Post a Comment