Sunday, November 19, 2023

Phoenix Scam

Phoenix Scam.

Politics Telangna War 2023

Posted by admin on 2023-11-19 06:13:21 |


AP Cash for BRS via Phoenix Scam.

  • తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్ర డబ్బు.
  • ఫినిక్స్ భారీ వాణిజ్య భవంతులు అగ్రిమెంట్స్.
  • 2500 కోట్ల క్యాచ్ రెడీ.
  • 60 నియోజకవర్గాల టార్గెట్ గా 1800 కోట్లు పంపకం.
  • ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పై 33 కథనాలు ప్రజల ముందు
  • భయటపడుతున్న ఏపీ-తెలంగాణ బంధాలు.
  • కళ్ల ముందు కదలాడుతున్న పట్టించుకునే నాథుడే లేడు.
  • తూతూ మంత్రంగా ఐటీ దాడులు
  • కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా గప్ చిప్.
  • బీఆర్ఎస్ తో 14 ప్రాజెక్ట్స్ లో భారీగా లబ్దిపొందిన ఫినిక్స్.
  • సాక్షాదారాలతో సహా ప్రత్యేక కథనాలు ఇచ్చిన దేవేందర్ రెడ్డి.
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఎక్ల్సూజివ్ స్టోరీ.

Courtesy / Source By :

Devender Reddy

9848070809

  ఎన్నికలంటే డబ్బులు వస్తునే ఉంటాయి. 

    ఎన్నికల్లో డబ్బులు ఇస్తారని తెలుసు కాని అవి ఎలా వస్తాయో చాలా మంది తెలియదు. పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆయా కంపనీలను పెంచిపోషిస్తాయి. ఆ కంపనీలు రూ. 100 ఖర్చు చేస్తే 10,000 రూపాయలు సంపాదిస్తాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కి రాగానే బంగారుబాతులా ఉండే హైదరాబాద్ భూములను అక్రమంగా కట్టపెట్టారు. ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు. దీంతో వేల కోట్ల రూపాయలు మైహోం, వంశీరాం బిల్డర్స్, డీఎస్ఆర్ ఇన్ఫ్రా, ఫినిక్స్ , వాసవి, హానర్ హోమ్స్, రామ్కీ, ఇలా 15 రియల్ ఎస్టేట్ కంపనీలకు వివాదస్పద, అసైన్డ్  భూములను క్లియర్ చేసి ఇవ్వడంతో లక్షల కోట్ల అదాయం కొన్ని కంపనీలే పొగుచేసుకున్నాయి. పేరు చెప్పిన ప్రతి కంపనీ అక్రమ అనుమతుల పై  పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్.కామ్ వద్ద  పూర్తి సాక్షాదారాలు ఉన్నాయి. ఇప్పుడు ఫినిక్స్ భవంతులను ఏపీ ప్రభుత్వ పెద్దలు కొనుగోలు చేయడంతో పెద్ద ఎత్తున నగదు రూపంలో తెలంగాణకు చేరుకుంటుంది. 

4 కమర్షియల్ బిల్డింగ్స్ విలువ 2500 కోట్లు.

 తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీగా లబ్దిపొందిన ఫినిక్స్ సంస్థ బీఆర్ఎస్ పార్టీ కోసం ఎన్నికల్లో భారీ భవంతులను అమ్మెస్తుంది. ప్రధాన కూడల్లో ఉన్న 35 లక్షల స్వ్కేయిర్ ఫీట్ల భవంతులకు అగ్రిమెంట్లు జరిగినట్లు సమాచారం.

లిక్కర్ మాఫియా, ఇసుక దందా సొమ్మే. 

ఏపీలో భారీగా నగదు నిల్వ ఉండడానికి కారణం లిక్కర్ , ఇసుక బిజినెస్ లే. అక్కడ ఉన్న నగదు ఇప్పుడు హైదరాబాద్ లోని ఫినిక్స్ బిల్డింగ్స్ ని అగ్రిమెంట్స్ చేయించుకుని అప్పగిస్తున్నారు. ప్రత్యేక హెలిక్యాప్టర్స్ లో హైదరాబాద్ కు చేరుకున్నట్లు సమాచారం.

 అప్పుడు, ఇప్పుడు కారు చౌకగానే

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ నేతల భూములను తక్కువ ధరకు అగ్రిమెంట్లు చేసుకుని కొనుగోళ్ల వ్యవహారం నడిపించారు బీఆర్ఎస్ బినామిల కంపనీలు. ఇప్పుడు తెలంగాణలో డబ్బు సరిపోవడం లేదని ఫినిక్స్ భవంతులను 12 వేలకు స్వ్కోయిర్ ఫీట్ అమ్మే ప్రాంతంలో 7 వేలకు అమ్మేస్తున్నారు.

 60 సీట్లలో 30 కోట్ల చొప్పున వెళ్లాల్సిందే.

 టార్గెట్ 60గా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ. అవలీలగా గెలిచే 10 నియోజకవర్గాల్లను కలుపుకొని మొత్తం 60 అభ్యర్దులకు 30 కోట్ల చొప్పున పంపించేలా పక్క ప్లాన్ వేసుకున్నారు. అందుకే వారం రోజుల్లోనే అన్ని సర్దుకున్నారు. మరో పది రోజుల్లో ఏపీ డబ్బుల కుప్పలు తెలంగాణలో పారనున్నాయి.

 నోట్ల పంపిణీ ఆపలేమా..?

 సాదారణ ప్రజలు లక్ష రూపాలయు తీసుకెళ్లితే నానా ఇబ్బంది పెడుతున్న అధికారులు. అధికార పార్టీలు వేల కోట్ల రూపాయలను సప్లై చేస్తున్నా పట్టించుకోవడం లేదు. నిఘా వర్గాలకు సమాచారం ఉన్నా చూసిచూడనట్లు వ్యవహారిస్తున్నారు. డబ్బులు తీసుకోవద్దని ప్రచారం చేస్తున్నారు. కాని డబ్బులు పంచే సమయంలో యువత అడ్డుకట్ట వేస్తే ప్రజాస్వామ్యం పదికాలాల పాటు వర్ధిల్లుతుంది.

No comments:

Post a Comment