Wednesday, November 1, 2023

_గులాం గిరీ బంద్..# 35మంది పోలీసుల బదిలీకి రంగం సిద్ధం_

*_గులాం గిరీ బంద్..!_*
_# నో పోలీస్ సెల్యూట్_
_# ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకూ అంతే.._
_# యమ ఇబ్బందులు పడుతున్న రాజకీయులు_
_# 35మంది పోలీసుల బదిలీకి రంగం సిద్ధం_
_# ఆరుగురు ఎక్సైజ్ సిబ్బంది కూడా.._

Courtesy / Source by :
_(అనంచిన్ని వెంకటేశ్వరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_నిత్యం పోలీసుల భద్రత, సెల్యూట్లు, అధికారుల ప్రోటోకాల్స్, మధ్య ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పోరేషన్ చైర్మన్ లకు ఇవి దూరమయ్యాయి. దీంతో పార్టీలకు అతీతంగా ప్రొటోకాల్ ఉన్న రాజకీయ నాయకులు అందరూ తెగ ఇబ్బందులు పడుతున్నారు. సెల్యూట్ తో నిద్ర లేచే నాయకులు మరీ దిగాలు చెందుతున్నారు. పోలీసులు మాత్రం ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది._*

*_ఇదీ ప్రస్తుత పరిస్థితి:_*
తెలంగాణ రాష్ట్రంలోని ఒక ముఖ్యమంత్రితోపాటు 17 మంత్రులు, ప్రభుత్వ విప్ లు, 102మంది  శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పోరేషన్ చైర్మన్ లకు ప్రొటోకాల్ ఉంది. వారు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు పోలీసుల గౌరవ వందనం, సెల్యూట్, వివిధ రకాల ప్రొటోకాల్స్, హంగు ఆర్భాటాలు, ట్రాఫిక్ ఆపుచేయడం లేదా మళ్ళించడం వంటివి ఉండేవి. కిందిస్థాయి పోలీసుల హైరానా మామూలుగా ఉండేది కాదు. అయితే ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఇక అవి లేవు. పైలెటింగ్ సేవలు కూడా ఉండవు. ప్రభుత్వం కల్పించిన వ్యక్తిగత భద్రత నీడలో ప్రజాప్రతినిదులు ఉంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సభలకు గతంలో డీఐజీలు, ఐజీలు వచ్చి భద్రత పర్యవేక్షణ చేసేవారు. ఇప్పుడు జిల్లాల ఎస్పీలే బందోబస్తు చర్యలు తీసుకుంటారు. ఎన్నికలు పూర్తయి ఎమ్మెల్యేలుగా గెలిచి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు అధికారులు, పోలీసుల నుంచి రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక మర్యాదలు ఉండవు. దీంతో పోలీసులకు పని భారం బాగానే తగ్గింది. నగరాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కవాతులు నిర్వహించటం కన్పిస్తుంది.

బాక్స్:
*_మాకొద్దీ  పోలీస్_*
_# ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు_
_# 35మంది అధికారులపై వేటు_

ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పట్నుంచి పోలీసుశాఖపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. - కొంతమందికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారిపైనా చర్యలు తీసుకోవాలంటూ స్థాయిలో పనిచేస్తున్న అనేక మంది డీఎస్పీలు, సిఐల సేవలపై ఫిర్యాదులు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మరికొందరిపై ఉందనే ప్రచారం వేటుపడే అవకాశం ఆ శాఖలో జరుగుతోంది.

ఎన్నికల నిర్వహణలో పోలీసుశాఖ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే రాజకీయ నాయకులు తమ నియోజకవర్గాల్లో అనుకూలమైన అధికారులే ఉండాలని కోరుకుంటారు. అందుకు అనుగుణంగానే గత జూన్ నెలలో రాష్ట్రవ్యా ప్తంగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు జరిగాయి. నిబంధనల్లో భాగంగా మూడేళ్లపాటు ఒకే జిల్లాలో పనిచేసిన వారిని మార్చారు. ఎన్నికల ముంగిట్లో జరిగిన ఈ బదిలీల్లో పైరవీలు
జరిగాయని, స్థానికంగా ఉన్న కీలక నేతలు తమకు అనుకూలంగా వ్యవహరించే అధికారు లను తెచ్చుకున్నారంటూ విపక్ష నేతలు ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత ఎన్నికల సన్నాహాల్లో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల కమిషన్ అధికారులు పోలీసుశాఖ పనితీరును విశ్లేషించారు. ఒకేసారి 13 మంది పోలీసు అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించారు.

ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న వారిపై కూడా కొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో మరికొందరిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 35 మందితో ఓ జాబితా తయారైనట్లు తెలుస్తోంది.

బాక్స్ 2:

*_ఆబ్కారీలో ఆరుగురిపై ఫిర్యాదు_*
తెలంగాణ ఆబ్కారీశాఖ డైరెక్టర్ గా మూడు నెలలే పనిచేసిన ముషారఫ్ అలీపై ఎన్నికల కమిషన్ ఇప్పటికే వేటు వేసింది. తాజాగా మరో ఆరుగురు కీలక అధికారులపై ఫిర్యా హదులు వెల్లువెత్తినట్టు సమాచారం. 20 ఏళ్లుగా హైదరాబాద్, ఆ చుట్టుపక్కలే పనిచేస్తూ ఎన్నికల సమయంలో ఆ శాఖలో అక్రమాలకు ఊతమిస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి పలువురు ఫిర్యాదులు పంపినట్టు సమాచారం. డిప్యూటీ కమిషనర్ తో పాటు అయిదుగురు సూపరింటెండెంట్ల గురించి ఆ ఫిర్యాదులో ఏకరవు పెట్టినట్టు తెలిసింది. 'గత అసెంబ్లీ ఎన్నికలతోపాటు మునుగోడు ఉప ఎన్నికల్లో అధికారిక వాహనాల్లోనే వీరు మద్యం, డబ్బు సరఫరా చేశారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచేందుకు వీలుగా అదనపు నిల్వలతో కూడిన మద్యం డంప్ లు ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఓ సూపరింటెండెంట్ స్థాయి అధికారిని ఆదిలాబాద్ కు పంపడంతోపాటు ఏడుగురు అధికారులను అనుకూల స్థానాల్లో పోస్టింగ్లు ఇప్పించుకోవడంలో కీలకపాత్ర పోషించారు" అని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment