Tuesday, November 28, 2023

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో... రూ.500 నోట్ల రద్దు...?

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో... రూ.500 నోట్ల రద్దు...?



* తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో రిజర్వ్ బ్యాంక్ తీవ్ర నిర్ణయం.?
*తెలంగాణలో చలామనీలో ఉన్న సిరీస్ నెంబర్లన్నీ నిఘా వర్గాలకు పంపిన వైనం.!
* సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వీడియోలో సంచలన విషయాలు (ఆ లింక్ కూడా ఇస్తున్నాం)
# భరాస పంచుతున్న నోట్లు అన్నీ అవే.! పంచకుంటే నో ఫిగర్, నో ఫియర్
* అందుకే సొంత డబ్బులు తీయని 'గులాబీ' నేతలట.!
* ప్రజలను 'వెర్రి పువ్వు'లా భావిస్తున్న కేసీఆర్.?
* ఒక్కో నియోజకవర్గానికి డమ్మీ రూ.30 కోట్లు అట.!..!
* పాపం.! మహిళలు, తాగుబోతులే టార్గెట్..అట.!
* యువతకు క్రికెట్ కిట్స్, ఆ, ఆ లతో గాలం..!
* అవి తీసుకుంటే ఆ తరువాత  తీవ్రమైన కేసులతో ఫిక్స్. అట..!

* ఎలాంటి సమస్యలు లేకుండా మధ్యవర్తుల ద్వారా పంపిణీ.. అట.!

Courtesy / Source by : (దశాబ్ది ఉత్తమ పరిశోధన పాత్రికేయ అవార్డు గ్రహీత అనంచిన్ని వెంకటేశ్వరరావు, 9440000009)

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం ప్రవాహానికి ఎన్నికల కమిషన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినా రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని గత నాలుగు నెలల క్రితమే వ్యూహాత్మకంగా స్థానిక నియోజకవర్గాలకు డబ్బులు పంపినట్లు ఆరోపణలు తలెత్తాయి. (అందుకే కాబోలు ఒక్క అధికారపార్టీ నాయకుడి దగ్గర ఒక్క రూపాయి దొరికిన ఆనవాలు లేవు. అందుకే కేంద్ర ఎన్నికల కమిషన్ భారత ప్రజాస్వామ్య విలువలను కాపాడటం కోసం.. రాజ్యాంగం పరిరక్షిచటం కోసం ఓ తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

అసలేం జరిగిందంటే..?
తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కేంద్రం దేశ శ్రేయస్సు కోసం ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నల్లడబ్బు (బ్లాక్ మనీ) నియంత్రణలో భాగంగా.. రూ.500ల నోట్లను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సామాన్యుల డబ్బు సేఫ్.. కానీ..:
ఈ సదుద్దేశంలో భాగంగా సామాన్యుల డబ్బుకు ఎలాంటి అవరోధం లేకుండా... ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్న రెండు అవకాశాలను పరిగణనలోకి తీసుకొని చెలామణీలో లేని బ్లాక్ మనీ నెంబర్లను ఇప్పటికీ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది.

అధికార పార్టీలోనే..:
అత్యధికంగా పన్నులు చెల్లించని (నల్ల డబ్బు) బ్లాక్ మనీ వేల కోట్లు ఉన్నట్లు నియోజకవర్గాలకు చేరినట్లు తెలుస్తోంది. ఒక్క తెలంగాణలోనే ఓటరు ఒక్కోకరికి ఐదు వేలు పంచుతున్నారంటే.. ఆశ్చర్యం. అందుకే ఎన్నికల సంఘం రిజర్వ్ బ్యాంకును ఆశ్రయించి... కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ముందుకు వెళ్ళానున్నట్లు తెలుస్తోంది.

బాక్స్:

దమ్ముంటే రద్దు చేయండి -సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతుంటే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ లు ఏం చేస్తున్నాయని, పేదలకు సామాన్యులకు ఎలాంటి సమస్యలు లేకుండా వెంటనే రూ. 500ల నోట్లను రద్దు చేయాలి.

ఒక్కోసారి చేయండి:
ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వ్యవస్థాపక సభ్యులు

ఎన్నికల్లో ధోనీ ప్రవాహం తగ్గించాలంటే ఎక్కడో ఒక దగ్గర తొలి అడుగు పడాలని, ఇది మంచి తరుణమని తెలంగాణ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, అఖిల భారత వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జాతీయ అధ్యక్షులు కె.కోటేశ్వర్ రావు, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు, నామాల విశ్వేశ్వరావు, బెలిద హరినాథ్, రవికుమార్, సిహెచ్‌.వెంకటేశ్వర్లు తదితరులు పేర్కొన్నారు.


స్పెషల్  బాక్స్:
సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వీడియో లింక్ ఇది

https://youtu.be/SE6y7yT596s?si=n7OG1zkmgEJz2LXz

No comments:

Post a Comment