Monday, November 27, 2023

రైతుబంద్..కాకా షాక్.!

రైతుబంద్..కాకా షాక్.!



* తెలంగాణ సర్కార్‌కు ఈసీ యూటర్న్ 
* నోరు జారిన మంత్రి హరీష్‌రావు
* తీవ్రంగా స్పందించిన 'ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక'

Courtesy / Source by : (అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)

ఎన్నికల వేళ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. సోమవారం ఉదయం వరకు 'రైతుబందు' డబ్బులు పడితే రైతులు గంపగుత్తగా ఓట్లు వేస్తారని  గులాబీ పార్టీ నేతలు భావించారు. ఒకవిధంగా చట్టబద్దంగా జరుగుతున్న ఈ పంపిణీ పట్ల ఓటర్లు అందరూ ఎన్నికల సంఘాన్ని అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది.

గులాబీ శ్రేణుల్లో గుబులు:
ఇప్పటికే కాంగ్రెస్‌కు పెరుగుతున్న గ్రాఫ్‌తో ఆందోళన చెందుతున్న గులాబీ శ్రేణులకు ఈసీ సంచలన షాకిచ్చింది. రైతుబంధు పంపిణీ విషయంలో ఎలక్షన్ కమిషన్ యూటర్న్ తీసుకుంది. రైతుబంధు పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.

రెండు విడుతల్లో ఆర్థిక సాయాన్ని అందిస్తుండగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో రబీ సీజన్‌కు ప్రభుత్వం రైతుల ఖాతాల్లో సాయాన్ని జమ చేయలేకపోయింది. అయితే, ప్రభుత్వం రైతుబంధు నిధుల విడుదలకు ఈసీ అనుమతి కోరగా.. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. తాజాగా.. ఈసీ అనుమతిపై విపక్షాలు తీవ్రంగా రియాక్ట్ కావడంతో పాటు ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూరేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశాయి. దీంతో రైతుబంధు పంపిణీపై ఈసీ యూటర్న్ తీసుకున్నట్లు సోమవారం ప్రకటించింది.

ఎన్నికల వేళ:
ప్రతి ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. 28వ తేదీ 70 లక్షల రైతుల ఖాతాల్లో సుమారు 7 వేల కోట్ల రూపాయలు రైతుబంధు నిధులు వేసేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు వెలువడిన ఈసీ తాజా ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ నిలిచిపోయింది.

బాక్స్:
నోరుజారిన మంత్రి హరీష్‌రావు:
ఆదివారం ఓ బహిరంగ సభలో రాష్ట్ర ఆర్థిశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. మీరు సోమవారం ఉదయం టీ తాగే సమయానికి టింగ్‌ టింగ్‌ టింగ్‌ అంటూ రైతుల ఫోన్లకు రైతు బంధు నిధులు జమ అయిన మెసేజ్‌లు వస్తాయని ప్రకటించారు. అయితే, ఈ రోజు బ్యాంకులకు సెలవు ఉంది. గురుపౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంది.. కానీ, హరీష్‌రావు. సోమవారమే డబ్బులు పడతాయని ప్రకటించారు.

బాక్స్ 2:
తీవ్రంగా స్పందించిన 'ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక':
తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్‌ ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఇప్పుడు రైతు బంధుకు అనుమతి ఇవ్వడం ఏంటి? అనే ఫిర్యాదులు కూడా ఎన్నికల కమిషన్‌కు వెళ్లాయి. 'ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక' ఎన్నికల కమిషన్‌ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని బకాయిలు చెల్లించాలని, అందరికీ ఒకే విధమైన న్యాయం చేయాలని కోరింది. దీంతో రైతుబందు 
అనుమతిని ఉపసంహరించుకుంది.

No comments:

Post a Comment