Monday, November 13, 2023

నిర్లక్ష్యం ఖరీదు 9 మంది ప్రాణాలు

నిర్లక్ష్యం ఖరీదు 9 మంది ప్రాణాలు

Courtesy / Source by: Disha Web Desk 12  14 Nov 2023 7:30 AM
దిశ సిటీ బ్యూరో: నగరం నడిబొడ్డున ఉన్న నాంపల్లి కి సమీపం లోని బజార్ ఘాట్ లో సోమవారం ఉదయం సంభవించిన భవనానికి జీహెచ్ఎంసీ అధికారులు 15 ఏళ్ల క్రితం గ్రౌండ్ ప్లస్ 2 అనుమతులు మాత్రమే ఇచ్చినట్లు సమాచారం. కానీ భవన యజమాని అదనంగా మరో రెండు అంతస్తులు, పైన పెంట్‌హౌస్ ను అక్రమంగా నిర్మించినట్లు జీహె‌చ్ఎంసీ అధికారులు గుర్తించారు. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం పార్కింగ్ కోసం వినియోగించాల్సిన సెల్లార్ లో డ్రమ్ములో భారీగా రసాయనాలు నిల్వ చేయడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సెల్లార్ ను కమర్షియల్ గా వినియోగిస్తూ, పైన అంతస్తులను రెసిడెన్షియల్ గా వినియోగిస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించలేకపోయారు. జీ ప్లస్ 2 అనుమతి తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. Also Read - ఒక్కరోజే హైదరాబాద్‌లో 16 అగ్ని ప్రమాదాలు నిర్మాణం కూడా పూర్తిగా నిబంధనలకు విరుద్దంగా సెట్ బ్యాక్ లు లేకుండా నిర్మించినట్లు అధికారులు ధ్రువీకరించారు. జనావాసాల మధ్య భయంకరమైన రసాయనాలను డ్రమ్ముల కొద్దీ నిల్వ చేయడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి ఏకంగా తొమ్మిది మంది, అందులో చిన్న పిల్లలిద్దరు సజీవదహనమయ్యారని స్థానికులు వాపోతున్నారు. ఇదే రకంగా ఏడాది కాలంలో గోషామహాల్ లో, సికింద్రాబాద్ బోయిగూడలోని టింబర్ డిపో లో, అలాగే సికింద్రాబాద్‌లోని దక్కన్ మాల్ లో, ఆ తర్వాత స్వప్నలోక్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కు కూతవేటు దూరంలో వైఎంసీఏ వద్దనున్న ఎలక్ట్రిక్ బైక్ ల గోదాంలో కూడా వరుసగా అగ్ని ప్రమాదాలు జరిగి సుమారు 30 మంది ప్రాణాలు కొల్పయినా, అధికారులు మాత్రం ప్రమాదాల నివారణకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Also Read - కారు దిగుతున్న కార్పొరేటర్లు.. ఆందోళనలో బీఆర్ఎస్ సెల్లార్ల వినియోగం పై కొరవడిన నిఘా హైదరాబాద్ మహానగరంలో సెల్లార్ల వినియోగాన్ని నియంత్రించడంలో జీహెచ్ఎంసీ ఘోరంగా విఫలమవుతుందన్న వాదనలున్నాయి. నేటికీ చాలా భవనాల్లో సెల్లార్లను కమర్షియల్ గా వినియోగించడం, దానిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఒక వరంగా మారింది. చాలా సెల్లార్లలో ప్రారంభించిన హోటల్లు ,ఇతర వాణిజ్య సంస్థలను ప్రజాప్రతినిధులే ప్రారంభించడం గమనార్హం. సెల్లార్ల వినియోగంపై గతంలో వందలాది నోటీసులు జారీ చేసినా, ఆ తర్వాత తదుపరి చర్యలు చేపట్టకపోవటం ఒక రకంగా అగ్ని ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం వాటిల్లేందుకు కారణమవుతుందంటూ నగర వాసులు మండిపడుతున్నారు. నేటి కీ నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోని చాలా భవనాల్లో సెల్లార్లలో హోటళ్లు, పెద్ద పెద్ద షో రూమ్‌లు, గోదాములను ఏర్పాటు చేస్తున్న కనీసం ప్రశ్నించే నాథుడే కరవయ్యాడు. Also Read - పొలిటికల్ 'ఫైర్'.. నాంపల్లి అగ్ని ప్రమాదంపై రాజకీయాలు పైగా జీహెచ్ఎంసీ అధికారులు వాటికి ట్రేడ్ లైసెన్స్ లు సమకూర్చటం జీహెచ్ఎంసీ అధికారుల కాసుల కక్కుర్తికి నిదర్శనం. ఏడాది క్రితం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కార్యాలయం ఎదురుగానే సెల్లార్ లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ బైక్ గోదాములో అగ్ని ప్రమాదం జరిగి ఎనిమిది మంది మృతి చెందిన తర్వాత అక్కడ సెల్లార్ దుర్వినియోగం చేస్తున్నారన్న విషయం వెలుగులోకి రావడం లేదు. జీహెచ్ఎంసీ అధికారులు కేవలం భవనాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసి తమ పనైపోయిందని భావించడం వల్లే వరుసగా అగ్ని ప్రమా దాలు జరుగుతున్నట్లు వాదనలున్నాయి. అది ఉత్తుత్తి కమిటీనా? సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ సేఫ్టీ మెజర్స్పెంచే దిశగా చర్యలు చేపడుతున్నామని ప్రకటించిన జీహెచ్ఎంసీ ఇందుకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుందని అప్పట్లో ప్రకటించినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఏ ఒక్క భవనాన్ని తనిఖీ చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వప్నలో కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు మాత్రమే జీహెచ్ఎంసీ ఈవీడీఎం అధికారులు ఫైర్ సేఫ్టీ లేని సుమారు 2 వేల భవనాలను గుర్తించి, వాటిలో కేవలం 750 భవనాలకు మాత్రమే నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. కనీసం నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన ప్రమాద ఘటనతోనైనా అధికారులు స్పందిస్తారా? కమిటీ నియమిస్తారా? ఫైట్ సేఫ్టీపై పకడ్బందీ చర్యలు చేపడతారా ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

https://www.dishadaily.com/telangana/hyderabad/negligence-was-the-cause-of-the-nampally-accident-272488

No comments:

Post a Comment