Thursday, April 6, 2023

భాజపాలోకీ మాజీ సీఎం నల్లారి....!

*భాజపాలోకీ మాజీ సీఎం నల్లారి....!*

దిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి భాజపాలో చేరనున్నారు. దిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్యనేతల సమక్షంలో శుక్రవారం ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు.మధ్యాహ్నం కిరణ్‌కుమార్‌రెడ్డి చేరిక కార్యక్రమం ఉంటుందని భాజపా వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో కిరణ్‌కుమార్‌రెడ్డి వివిధ పదవులు చేపట్టారు. 2010 నవంబర్‌ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా ఆయన పనిచేశారు. అంతకుముందు శాసనసభ స్పీకర్‌గా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన అనంతరం జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. 2014 ఎన్నికల్లో అదే పార్టీ తరఫున ఆయన బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు భాజపాలో చేరేందుకు సిద్ధమయ్యారు.

*సుజీవన్ వావిలాల*🖋️

No comments:

Post a Comment