Thursday, April 20, 2023

కర్నాటక ఎన్నికల బరిలో బిచ్చగాడు

*_కర్నాటక ఎన్నికల బరిలో బిచ్చగాడు_*
_★ భిక్షాటనతో సేకరించిన చిల్లరతో నామినేషన్‌ సమర్పణ_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

'దేశంలో ఏ ఎన్నికల్లో నిలబడాలి' అన్నా స్థాయిని బట్టి నోట్ల ఖర్చు మారుతుంది. అయితే కర్ణాటక విధానసభ ఎన్నికల్లో యాదగిరి పట్టణానికి చెందిన యంకప్ప అనే యాచకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగుతున్నారు. గురువారం నామపత్రం సమర్పించారు. ఇందుకు భిక్షాటనతో పోగు చేసిన రూ.10 వేలను డిపాజిట్‌గా చెల్లించారు. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి డిపాజిట్‌కు కావాల్సిన డబ్బు కోసం యాదగిరి నియోజకవర్గంలో తిరుగుతూ యాచించారు. అలా సేకరించిన నాణేలనే గురువారం ఎన్నికల అధికారికి ఇచ్చారు. 2 గంటలు శ్రమించి చిల్లరంతా లెక్కించి, నామినేషన్‌ స్వీకరించినట్లు అధికారి తెలిపారు. అనంతరం యంకప్ప మాట్లాడుతూ.. ‘నేను ఎందుకు పోటీ చేస్తున్నానో ప్రజలకు చెప్పా. వారి నుంచే డిపాజిట్‌ డబ్బూ సమీకరించా’ అని తెలిపారు. పగలు భిక్షాటన చేస్తూ పొట్టపోసుకునే యంకప్ప రాత్రిళ్లు ఆలయాల లోగిళ్లలో పడుకుంటారు. 

No comments:

Post a Comment