Wednesday, April 5, 2023

A1 గా బండి సంజయ్!

*A1 గా బండి సంజయ్!*

వరంగల్‌: టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలను పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా బండి సంజయ్‌ పేరును చేర్చారు.ఏ2 ప్రశాంత్‌, ఏ3 మహేష్‌, ఏ4గా మైనర్‌ బాలుడు, ఏ5గా శివగణేష్‌, ఏ6గా పోగు సుభాష్‌, ఏ7గా పొగు శశాంక్‌, ఏ8గా దూలం శ్రీకాంత్‌, ఏ9గా పెరుమాండ శార్మిక్‌, ఏ10గా పోతబోయిన వసంత్‌ను పోలీసులు పేర్కొన్నారు

120(బి) సెక్షన్‌ కింద సంజయ్‌పై కేసు నమోదు చేశారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో మొత్తం 10 మంది నిందితుల పేర్లు చేర్చారు. బండి సంజయ్‌ సహా ప్రశాంత్‌, మహేష్‌, శివగణేష్‌లను అరెస్ట్‌ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. టెన్త్‌ విద్యార్థికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరికొంతమంది కీలక సాక్షులను విచారించాల్సి ఉందని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

''ఏ2 ప్రశాంత్‌ ఎమ్మెల్యే ఈటలకు 10:41కి పేపర్‌ను పంపించారు. బండి సంజయ్‌కు 11:24కి ప్రశ్నపత్రం చేరింది. 9:30కే ప్రశ్నాపత్రం లీకైందంటూ ప్రశాంత్‌ తప్పుడు వార్తలు ప్రచారం చేశాడు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మాల్‌ ప్రాక్టీస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశాం. ఏ4గా మైనర్‌ ఉండటంతో వివరాలు వెల్లడించడం లేదు. టెన్త్‌ హిందీ పేపర్‌ను ప్రశాంత్‌ వైరల్‌ చేశాడు. ఈటల సహా చాలా మంది నేతలకు టెన్త్‌ పేపర్‌ వెళ్లింది. పరీక్షకు ముందు రోజు ప్రశాంత్‌, బండి సంజయ్‌ చాటింగ్‌ జరిగింది'' అని వరంగల్‌ సీపీ ఏవీ రంగనాథ్‌ వెల్లడించారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment