*చెప్తున్నా వినకుండా కాలర్ పట్టుకొని లాక్కెళ్లారు.... బండి సంజయ్ భార్య ఆవేదన....!*
కరీంనగర్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం అర్థరాత్రి కరీంనగర్‌లోపోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం బలవంతంగా పోలీస్ వాహనంలో యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీసుస్టేషన్‌కు తరలించారు. సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎందుకు అరెస్టు చేశారు, ఏ విషయంలో కేసు నమోదు చేశారనే దానిపై పోలీసుల నుంచి స్పష్టత లేదు.
తాజాగా సంజయ్‌ను అదుపులోకి తీసుకోవడంపై ఆయన భార్య అపర్ణ స్పందించారు. అసలు కరీంనగర్‌లోని ఇంట్లో మంగళవారం రాత్రి ఏం జరిగిందో ఆమె వివరణ ఇచ్చారు పోలీసులు అకస్మాత్తుగా ఇంటిపై దాడి చేసి తన భర్తను అరెస్ట్ చేయడంతో తీవ్ర భయాందోళనకు గురైనట్లు తెలిపారు. సంజయ్ హైదరాబాద్ నుంచి ఇంటికి చేరుకున్న కొద్దిసేపట్లోనే పోలీసులు దాడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి(అపర్ణ తల్లి) చనిపోయిన బాధలో ఉన్నామని.. చిన్న కర్మకు హాజరయ్యేందుకు వచ్చిన సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని వాపోయారు.
ఆమె మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి డిన్నర్ చేస్తున్న సమయంలో ఏసీపీ వచ్చారు. కూర్చొమని చెప్పి.. వెంటనే తిని ఆయన బయటకు వెళ్లారు. చెప్పండి సర్ ఇలా వచ్చారు అని అడిగితే.. అరెస్ట చేయాలి సర్ మిమ్మల్ని.. మాకు ఆర్డర్స్ వచ్చాయని తెలిపారు. ఏ విషయంలో అరెస్ట్ చేస్తున్నారు, అరెస్ట్ వారెంట్ ఉందా అని సంజయ్ అడిగితే లేదని చెప్పారు. కమిషనర్ సర్ నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పడంతో కమిషనర్‌కు ఫోన్ చేశారు. ఏ కారణంతోనే నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు..
ఆయన మాట్లాడుతుండగానే 40 మంది పోలీసులు వచ్చి సంజయ్‌ను చుట్టుముట్టారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున్న అడ్డుకునేందుకు యత్నించినా.. వినకుండా కాలర్ ప్టటుకుని బయటకు లాక్కెళ్లారు. ఇంట్లో ఉన్న సామన్లు, ఫర్నీచర్ బయటపడేశారు. ఇంటి దగ్గర దాదాపు గంట సేపు వాగ్వాదం జరిగింది. ఇప్పుడే తిన్నారు. హార్ట్ పేషెంట్.. మందులు వేసుకోలేదని నేను చెప్తూనే ఉన్నాను. అయినా మాట వినిపించుకోకుండా తీసుకెళ్లారు. ఒక ఎంపీని, ప్రజాప్రతినిధిని ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారని అనుకోలేదు. కనీసం ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పలేదు. మమ్మల్ని బయటకు కూడా రానివ్వకుండా డోర్ లాక్ చేశారు' అని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment