Sunday, April 30, 2023

తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన.... సీఎం కేసీఆర్....!

తెలంగాణ నూతన సచివాలయాన్ని ప్రారంభించిన.... సీఎం కేసీఆర్....!*
హైదరాబాద్‌: తెలంగాణ నూతన సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. తొలుత ప్రధాన ప్రవేశ గేటు వద్ద పూజలు నిర్వహించిన ఆయన..
తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోమశాల వద్ద యాగ పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అక్కడి నుంచి ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని సచివాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వాస్తుపూజ నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌ ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌కు చేరుకొని పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణకు పెద్ద సంఖ్యలో వేదపండితులు హాజరయ్యారు. ప్రధాన గేటు వద్ద ముఖ్యమంత్రిని వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతించి ఆశీర్వచనాలు పలికారు.

నూతన సచివాలయంలో మొత్తం 6 ఫైళ్లపై సీఎం సంతకాలు చేశారు. వీటిలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం యాదాద్రి టేబుల్‌ బుక్‌ను కేసీఆర్‌ ఆవిష్కరించారు. తన ఛాంబర్‌లో ఆసీనులైన సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, సీఎస్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు మంత్రి హరీశ్‌రావు పాదాభివందనం చేశారు. మరోవైపు మంత్రులు కూడా సుముహూర్త సమయంలో తమ ఛాంబర్లలోకి ప్రవేశించారు. మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ తదితరులు నిర్ణయించిన సమయానికి తమ సీట్లలో ఆసీనులయ్యారు.

*సుజీవన్ వావిలాల*🖋️ 

No comments:

Post a Comment