*రాహుల్ గాంధీపై మరో పరువునష్టం... కేసు!*
ముంబయి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తాజాగా మరో పరువు నష్టం కేసు నమోదవ్వటం దేశ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఆయన లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ వీర్ సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి
ఈ వ్యాఖ్యలకు స్పందించిన సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ బుధవారం పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత నిరాధారంగా తన తాత సావర్కర్‌పై ఆరోపణలు చేశారని సత్యకి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గొప్ప వ్యక్తిపై రాహుల్ తప్పుడు ఆరోపణలు చేశారనడానికి తన వద్ద ఆధారాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిజమని కోర్టులో నిరూపించాలని సవాల్ విసిరారు. 'మోదీ' ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ అగ్రనేతపై ఇప్పటికే పరువు నష్టం కేసు నమోదైన విషయం తెలిసిందే. సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష కూడా విధించటంతో.. ఎంపీ పదవిని కూడా కోల్పోయారు. ఇదే విషయంలో ఇటీవల పట్నాలోనూ ఆయనపై పరువు నష్టం కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పట్నా కోర్టు రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.
*సుజీవన్ వావిలాల*🖋️
No comments:
Post a Comment