Tuesday, April 11, 2023

సీఎం కేసీఆర్ అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించిండు

కేసీఆర్ ఊరూరా దొంగలను తయారు చేస్తుండు: ఆకునూరి మురళి
బీఆర్ఎస్ నేతలు గాదరి కిషోర్, బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్ లు ఉద్యమకారులు కాదని..ఉద్యమ ద్రోహులు, దోపిడీ దొంగలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. ఏప్రిల్ 10వ తేదీ సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ ఇతర దేశాలకు పంపి అక్కడ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రంలో ఊరూరా దొంగలను తయారు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలను.. విద్యావంతులు, స్టూడెంట్స్ ఊరూరా తిరుగుతూ ప్రజలకు తెలియజేయాలని కోరారు ఆకునూరి మురళి.

రాష్ట్ర అభివృద్ధికి రూ.16 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లుగా లెక్కలు చెబుతున్నారు. కానీ తొమ్మిది సంవత్సరాలలో విద్యారంగానికి సీఎం కేసీఆర్ ఖర్చు చేసింది నామమాత్రమే అన్నారు ఆకునూరి మురళి. సీఎం కేసీఆర్ విద్యను కార్పోరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కుట్ర చేస్తున్నారు వ్యాఖ్యానించారు. పేదలకు ప్రభుత్వ విద్య అందకుండా సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సంపద అంతా కొంత మంది చేతిలో బందీగా ఉందని దుయ్యబట్టారు.

తెలంగాణ పేద రాష్ట్రం కాదు..పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఫైర్ అయ్యారు అకునూరి మురళి. రాష్ట్ర సంపదను ప్రజలకు అందకుండా చేస్తున్నారు..నిరుద్యోగులు ఎన్ని కష్టాలు వచ్చినా చదవటం వదిలిపెట్టవద్దు. ఎవరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని సూచించారు. ప్రభుత్వం బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తోందని ఆకునూరి మురళి అన్నారు.

 Courtesy by : SDF 

No comments:

Post a Comment