Saturday, April 22, 2023

"పద్మశ్రీ"కి ఫించన్ పడలే.!

*_'పద్మశ్రీ'కి ఫించన్ పడలే.!_*
_★ వనజీవి రామయ్యకు ఘోర అవమానం.!_
_★'డబ్బులు ఇప్పించడయ్యా..!' అంటూ పడిగాపులు_
_★ చెట్లు నాటుతుండగా.. ఇటీవలే రోడ్డు ప్రమాదం_
_★ కాలికి గాయతోనే ప్రదక్షిణలు_
_★ ఖమ్మం కలెక్టరేట్ అవాంఛనీయ దృశ్యం_

_(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు, 9440000009)_

*_జీవితాన్ని త్యాగం చేసి నిస్వార్థ సేవలు చేసిన మహానుభావుల రుణం తీర్చుకోగలమా.? అలాంటి వ్యక్తులకు భారత ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత అవార్డులలో పద్మశ్రీ ఒకటి. అంతటి పురస్కారం పొందిన అరుదైన వారిలో వనజీవి రామయ్య ఒకరు. చెట్లను నాటడంలో ఆయన చేసిన కృషికి నాడు పద్మశ్రీ వస్తే... నేడు ఆయన తన పెన్షన్ అందలేదని ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కు రావడం బంగారు తెలంగాణాలో జరిగిన ఈ అవాంఛనీయ 'విషాద అంకం'పై 'ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న సంచలన కథనం._*

*_జీవితాన్నే త్యాగం చేసి.._*
ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వనజీవి రామయ్య జూలై 1వ తారీఖు 1937లో బాలయ్య పుల్లమ్మ దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు దరిపల్లి రామయ్య. సినీ తారలకు అభిమానులు ఎలా బిరుదులు ఇస్తారో... ఈ రియల్ హీరోకు ప్రజలు ఇచ్చిన బిరుదు 'వనజీవి రామయ్య'. పర్యావరణ పరిరక్షణలో ఈయన చేసిన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 30, 2017న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో దరిపల్లి రామయ్యకు నాటి రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ పద్మశ్రీ ప్రధానం రామయ్యగారూ..! హాట్సాఫ్. చేశారు. హాట్సాఫ్

*_ఎలా మొదలైంది..?_*
సమైక్య రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయంలో వాహన ఖర్చుల కోసం రూ. 1500లతో ఈ సదుపాయం మొదలైయింది. అది అంచెలంచెలుగా పెరిగింది. 1995 సేవా అవార్డు, 2005 వనమిత్ర అవార్డు, 2015 జాతీయ ఆవిష్కరణలు, అత్యుత్తమ సాంప్రదాయ నాలెడ్జ్ అవార్డు, 2017 పద్మశ్రీ అవార్డులు ఆయన ముంగిట వాలాయి. దీంతో పాటు గౌరవ వేతనం కూడా ఇప్పుడు సుమారు 40 వేలకు చేరింది. ఈ మొత్తం కూడా ఆయన వృక్ష సంబంధిత విషయాలకే వాడటం గమనార్హం. కాలికి కట్టుతో.. కలెక్టరేట్ కు వచ్చి... నెలనెలా తన అకౌంట్లో పడాల్సిన డబ్బులు పడటం ఆలస్యం కావడంతో పద్మశ్రీ వనజీవి రామయ్య కలెక్టరేట్ లోని డీఆర్డీయే కార్యాలయానికి వచ్చారు. తిరగడానికి, మొక్కల సంరక్షణకు ఇబ్బందిగా ఉందని అధికారులకు చెప్పారు. రెండు రోజుల్లో డబ్బులు వేస్తామని అధికారులు చెప్పారు.

*_ఇటీవలే వరుస రోడ్డు ప్రమాదాలు_* రోడ్డు ప్రమాదంలో వనజీవి రామయ్య కాలికి గాయమైంది. కాలికి సర్జరీ చేయాలని కూడా వైద్యులు సూచించారు. ఇదిలా ఉండగా మరోసారి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామయ్య తలకు గాయమైంది. 2019 మార్చిలో వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మార్చి 30న తన మనమరాలిని చూసి బైక్ పై వెళ్తున్న రామయ్యను మున్సిపల్ కార్యాలయం వద్ద ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో వనజీవి రామయ్యను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత రామయ్య కోలుకొన్నారు.

*_పద్దతి మారాలి_*
జీవితంలో ఓ ఆశయం కోసం, సమాజ శ్రేయస్సు కోసం అన్నీ త్యాగం చేసిన వనజీవి రామయ్య జరిగిన అవమానం మరోసారి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని 'ఆదాబ్ హైదరాబాద్' డిమాండ్ చేస్తోంది. వనజీవి రామయ్య ఈ రాజకీయులను క్షమించు.

No comments:

Post a Comment