Tuesday, May 12, 2020

Moosi Nala Encroachment

*ప్రజా సంకల్పం * 
Praja Sankalpam 

గౌరవనీయులైన తెలంగాణ మంత్రివర్యులు కేటీఆర్ సర్ గారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా ఉప్పల్ నియోజకవర్గం ఉప్పల్ డివిజన్ లోని దేవేందర్ నగర్ కు ప్రక్కన గల కాలీగా వున్న ప్రదేశంలో ఈరోజు కొందరు వ్యక్తులు అక్కడ నిర్మాణాలు చేపట్టారు. వారి వద్ద గల దస్తావేజులో ఎలాంటి సర్వే నెంబర్ వేయలేదు. 
దానిలో అప్పటి APIIC Dy. Zonal Manager (AM), Moula-Ali గారు ఇచ్చిన Allotment Letter No: 1513/IDAUPL(Nagole)/2007 Dated :25/11/2008 and final Allotment Letter dt :27/05/2009 of Zonal Manager, Moula-Ali, Hyderabad. అని వుంది. 

సర్ ఈరోజు ఇదే విషయం మీద ఉప్పల్ డిప్యుటీ తహసీల్దార్ గారికి తెలుపగా మాకు సంబంధం లేదు అది మున్సిపాలిటీ అధికారులకు అడగండి అన్నారు. తరువాత టౌన్ ప్లానింగ్ అధికారులకు అడుగగా అది మా పరిధిలో లేదు అది MRO గారి పరిధిలో ఉంటుంది అన్నారు. 
సర్ అసలు ఇది ఎవరి పరిధిలో వస్తుంది దయచేసి తెలుపగలరు. అక్కడ మూసీ నాలా ఉండేది గతంలో ఇప్పుడు దాని ఆచూకి లేదు. 

సర్ దయచేసి ఈ భూములను సర్వే చేయించి అవి *ప్రభుత్వభూములా లేదా ప్రవేటు వ్యక్తులకు చెందినదా * అని తెలుపవలసిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే ఎలాంటి సర్వే నెంబర్ లేకుండా భూమి హక్కులు ఎలా పొందినారో తెలియవలసిన అవసరం వుంది. 

సర్ ప్రజా సంకల్పం * గ్రూప్  ప్రభుత్వభూములను కాపాడాలి అని గతంలో కూడా పోరాటం చేసింది GHMC  LB Nagar Zonal Commissner పరిధిలో, ఆ విషయంలో కూడా అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. 
దయచేసి ప్రభుత్వభూమిలో నిర్మాణాలు పూర్తికాకముందే చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాను. 
*ఈ స్థలము అంబర్పేట్ అలీ కేఫ్ చౌరస్తా నుండి నాగోల్ మెట్రో స్టేషన్ వరకు గల సర్వీస్ రోడ్డుకు ఆనుకొనివున్నది. ఈ రోడ్డు GHMC అధికారులు 100ft లకు పై బడి రోడ్డును నిర్మాణం చేయాలని ఆలోచనతో వున్నారు. అలాంటి ప్రాంతంలో కబ్జాలు అవుతున్నాయి. *

ధన్యవాదములు. 

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
11/05/2020
Copy to Group link Media.

No comments:

Post a Comment