Sunday, May 31, 2020

తెలంగాణ విధ్యుత్ బిల్లులు

*రేపటి నుంచి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌*

హైదరాబాద్ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిచిపోయిన విద్యుత్‌ బిల్లుల జారీ మంగళవారం నుంచి మొదలవ్వనుంది. ఇందుకోసం టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యుత్‌ బిల్లుల జారీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులు ఏప్రిల్‌ నెల నుంచి మీటర్‌ రీడింగ్‌ తీయడం, బిల్లులు జారీ చేయడాన్ని నిలిపివేశారు. ఈఆర్‌సీ ఆదేశాల మేరకు ఏప్రిల్‌, మే రెండు మాసాలకు బిల్లులు జారీ చేయకుండా ప్రొవిజినల్‌ బిల్లులను చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీంతో డిస్కం అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీటర్‌ రీడర్లు మాస్కులు, గ్లౌజులు ధరించడం, శానిటైజర్లను వినియోగించడం తప్పనిసరి చేశారు.

*జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..*

🌀విద్యుత్‌ మీటర్‌ రీడర్లు ప్రతి రోజు గరిష్టంగా 300 ఇండ్లకు తిరిగి బిల్లులు జారీ చేస్తారు. అపార్ట్‌మెంట్లయితే ఒక్కోరోజు 500 వరకు సైతం బిల్లులు జారీ చేస్తారు. అయితే తాజా పరిస్థితుల్లో మీటర్‌ రీడర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని డిస్కం అధికారులు సూచిస్తున్నారు. మీటర్‌ రీడర్లు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లినప్పుడు విధిగా శానిటైజేషన్‌ చేసుకోవాలని, ముక్కు, మూతికి మాస్కు, చేతులకు గ్లౌజులు ధరించాలంటున్నారు. ఇక కాంట్రాక్ట్‌ ఏజెన్సీలే విధిగా బాధ్యత తీసుకుని మీటర్‌ రీడర్లకు శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులను ఉచితంగా అందించాలని ఆదేశాలిచ్చారు.

*బిల్లుల జారీ ఇలా..*

ప్రస్తుత మార్చి, ఏప్రిల్‌ మాసాలకు గాను 2019 మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో చెల్లించిన మొత్తాన్నే ప్రొవిజినల్‌ బిల్లులుగా జారీచేసిన విషయం తెలిసిందే. కొంత మంది ఆయా బిల్లును చెల్లించగా, మరికొంత మంది చెల్లించలేదు. దీని దృష్ట్యా పలు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా స్పాట్‌ బిల్లింగ్‌ మీటర్‌ రీడర్లల్లో ఆయా డేటాను లోడింగ్‌ చేసి అందుబాటులో ఉంచుతున్నారు.

మొదట మీటర్‌ రీడర్లు మార్చి, ఏప్రిల్‌, మే మూడు నెలల్లో వినియోగించిన మొత్తం రీడింగ్‌ను నమోదు చేస్తారు.

 మీటర్‌ రీడింగ్‌ తీసిన తర్వాత మొత్తం యూనిట్లను మూడు నెలలతో భాగించి ఒక్కో నెలకు ఎంత చెల్లించాలో యావరేజీ బిల్లుగా తేల్చుతారు.

ఆ తర్వాత ఇది వరకే ప్రొవిజినల్‌ బిల్లు కట్టి ఉంటే వాస్తవిక బిల్లు నుంచి ఆయా మొత్తాన్ని మినహాయించి కొత్త బిల్లును జారీ చేస్తారు.*

ఒకవేళ 2019 మార్చి, ఏప్రిల్‌ మాసాల ప్రొవిజినల్‌ బిల్లు కన్నా ప్రస్తుత బిల్లు కంటే అధికంగా చెల్లిస్తే మైనస్‌ బిల్లు, తక్కువ చెల్లించి ఉంటే వాస్తవిక బిల్లులను జారీచేస్తారు.*

మైనస్‌ బిల్లు జారీ అయితే ఎంత అదనంగా చెల్లించారో ఆయా మొత్తాన్ని తర్వాత మాసాల్లో జారీచేసే వాస్తవిక బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు. తక్కువ చెల్లించిన వారు, అసలే చెల్లించని వారు మాత్రం వాస్తవిక బిల్లు ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది.*

 *70 శాతం బిల్లులు వసూలు*

కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మందగించిన విద్యుత్‌ బిల్లుల వసూళ్లు ఇప్పుడిప్పుడే జోరందుకుంటున్నాయి. ఇప్పటి వరకు గ్రేటర్‌లో 70 శాతం మేర బిల్లులు వసూలయ్యాయి. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో విద్యుత్‌ సంస్థల ఆదాయంపై కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపింది. మార్చి మాసానికి కేవలం 35 శాతం మించి, ఏప్రిల్‌లో 56 శాతానికి పైగా బిల్లులు వసూలయ్యాయి. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు గ్రేటర్‌ నుంచి ప్రతి నెలా రూ.602 కోట్లు ఆదాయం రూపంలో హైదరాబాద్‌ నుంచి రూ. 254 కోట్లు, రంగారెడ్డి సర్కిళ్ల నుంచి రూ. 348కోట్లు సమకూరాల్సి ఉంది. కానీ హైదరాబాద్‌లో రూ.144 కోట్లు, రంగారెడ్డిలో రూ. 195కోట్ల మేర బిల్లులు మాత్రమే వసూలయ్యాయి. విద్యుత్‌ రెవెన్యూ ఆఫీసులను (ఈఆర్‌వో) సైతం తెరవడంతో వినియోగదారులు ముందుకొచ్చి బిల్లులు చెల్లిస్తున్నారు. దీంతో  బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, మేడ్చల్‌ సర్కిళ్లల్లో 70 శాతానికి పైగా బిల్లులు వసూలైనట్లు డిస్కం అధికారులు చెబుతున్నారు.

*💥2వ తేదీ నుంచి బిల్లుల జారీ*

*🏵️మీటర్‌ రీడింగ్‌ తీసి జూన్‌ రెండు నుంచి బిల్లులు జారీ చేస్తాం. ఇందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీచేశాం. జూన్‌ 1వ తేదీ వరకు బిల్లులు చెల్లించేందుకు అవకాశముంది. బిల్లుల డేటాను స్పాట్‌ బిల్లింగ్‌ మిషన్లలో లోడ్‌ చేసి 2వ తేదీ నుంచి బిల్లులు జారీచేస్తాం. మీటర్‌ రీడర్లు విధిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలని, శానిటైజర్లను వాడాలని ఆదేశాలిచ్చాం. మీటర్‌ రీడింగ్‌ కాంట్రాక్టర్లే వాటిని సమకూర్చాలని సూచించాం.- 
గౌరవరం రఘుమారెడ్డి,  సీఎండీ టీఎస్‌ఎస్పీడీసీఎల్.

గ్రూప్ link Media 
*ప్రజల పక్షం **

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
01/06/2020

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment