ప్రజా సంకల్పం *
Praja Sankalpam
తాజా వార్తలు
శ్రామిక్ రైళ్లకు 90 శాతం ఆక్యుపెన్సీ ఉండాల్సిందే
మార్గదర్శకాలు జారీ చేసిన రైల్వేశాఖ
న్యూదిల్లీ: లాక్‌డౌన్ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా ‘శ్రామిక్’ రైళ్లను నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రైళ్ల నిర్వహణకు సంబంధించి సదరు శాఖ తాజాగా పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటిని అమలు చేయాల్సిందిగా దేశవ్యాప్తంగా ఆయా రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి శ్రామిక్ రైలు దాదాపు 1200 మంది ప్రయాణికులను తరలిస్తుంది. మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా కేవలం చివరి స్టేషన్‌లో మాత్రమే నిలుపుతారు. 500 కిమీలకు పైగా దూరం ఉన్న ప్రాంతాలకు ఈ రైళ్లను వేశారు.
మార్గదర్శకాలివే..
* శ్రామిక్ రైళ్లను నడపడానికి కనీసం 90 శాతం ఆక్యుపెన్సీ ఉండాలి. ఈ మేరకు స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కార్మికులకు స్థానిక యంత్రాంగమే రైల్వే శాఖ జారీ చేసిన ప్రయాణ టికెట్లు అప్పగించాలి. వారి వద్ద నుంచి టికెట్ల రుసుం వసూలు చేసి రైల్వే శాఖకు ఇవ్వాలి. సంబంధిత స్టేషన్ వద్ద పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలి. కేవలం ప్రయాణికులను మాత్రమే స్టేషన్ ప్రాంగణంలోకి అనుమతించాలి.
* రైలు బయలుదేరేముందు ప్రయాణికులకు భోజనం, నీటి సౌకర్యం కల్పించాలి. 1200 కి.మీ పైబడి ప్రయాణం అయితే రైల్వే ఒక పూట భోజనం పెడుతుంది.
* ప్రతి ప్రయాణికుడికి మాస్క్ తప్పనిసరి. ఈ మేరకు అక్కడి ప్రభుత్వాలు చొరవ చూపాలి. వారితో ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేయించాలి.
* రైలు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత.. కార్మికులకు స్క్రీనింగ్, క్వారంటైన్, వారి తదుపరి ప్రయాణ వ్యవహారాలను అక్కడి ప్రభుత్వం బాధ్యత. స్టేషన్‌లో సెక్యూరిటీ తప్పనిసరి.
* ఒకవేళ భద్రత, పరిశుభ్రత, సేఫ్టీ అంశాల్లో లోపాలు కనిపిస్తే.. సదరు రైళ్లను రద్దు చేసే హక్కు రైల్వేశాఖకు ఉంటుంది.
గ్రూప్ link media ఈనాడు సౌజన్యంతో
గ్రూప్ @అడ్మిన్ bplkmCS
Bapatla Krishnamohan
03/05/2020.
No comments:
Post a Comment