**తరలి వెళ్లిన వలస కార్మికులు **
ప్రజా సంకల్పం
Praja Sankalpam
లాక్ డౌన్ నేపథ్యంలో గత 50రోజుల నుండి ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ మరియు ఉప్పల్ డివిజన్ లలోని వలస కార్మికులను (ఉత్తరప్రదేశ్ & బీహార్ & జార్ఖండ్ ) *ప్రజా సంకల్పం ** గ్రూప్ పర్యవేక్షిస్తూ వస్తుంది.
వలస కార్మికుల సమస్యలను *తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారికి మరియు తెలంగాణ DGP సర్ గారికి మరియు రాచకొండ CP సర్ గారికి మరియు మేడ్చల్ జిల్లా కలెక్టర్ సర్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి వారికి స్వంత రాష్ట్రాలకు పంపేలా చేయడంతో వారు పడిన ఆనందం చెప్పలేనిది..
ఈరోజు *ప్రజా సంకల్పం ** గ్రూప్ @అడ్మిన్ గా దగ్గరుండి అన్ని విధాలుగా వారికి సహకరించడం జరిగింది. అధికారులతో చర్చించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి
అనంతరం స్వంత రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ కు రైలు లో తరలించడం జరిగింది.
**అన్ని విధాలా వలస కార్మికులకు అండగా ఉండి ఆదుకున్న అధికారులకు (అధికారులు వారి పేర్లు రాయవద్దని చెప్పారు అందుకే వ్రాయలేదు ) కృతజ్ఞతలు తెలుపుతున్నాను**.
గత వారం క్రితం ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక గ్రూప్ వెళ్ళింది. ఈరోజు (14/05/2020....సమయం 01:15AM )దాదాపు అందరు(ఉత్తరప్రదేశ్ ) వెళ్లారు. కొద్ది మంది మాత్రమే ఇక్కడ వుంటాము అన్నారు.
**ఇంకా ఇప్పుడు మిగిలింది బీహార్ మరియు జార్ఖండ్ వాళ్ళు. వారిని కూడా త్వరలో పంపిస్తాము అని అధికారులు చెప్పడం జరిగింది**.
గ్రూప్ @అడ్మిన్ bplkmCS
Bapatla Krishnamohan
Copy to Group link Media
No comments:
Post a Comment