Sunday, May 17, 2020

ఉప్పల్ నియోజకవర్గం లో బీహార్ వలస కార్మికులకు దైర్యం చెపుతున్న ప్రజా సంకల్పం

ఉప్పల్ నియోజకవర్గం లోని ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్  వలస కార్మికులకు తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారు చెప్పిన రేషన్ సరుకులు అధికారులు ఇవ్వక ఇబ్బందులు పడుతూ గడిపారు. అయితే శ్రామిక రైలు వేసాక వారిలో ఉత్సాహం వచ్చింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ అధికారులు వారికి pass లు విచారణ చేసి ఇవ్వడం జరిగింది. అయితే మొత్తం GHMC పరిధిలో అలాగే తెలంగాణ జిల్లాల వారిగా అధిక సంఖ్యలో వలస కార్మికులు ఉండడం వలన ప్రతి రోజు నిబంధనల ప్రకారం పోలీస్ అధికారులు వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో  వున్న వారిని వారి వారి సొంత రాష్ట్రాలకు పంపియడం జరుగుతుంది. గత వారం రోజులుగా ఉప్పల్ పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అహర్నిశలు కష్టపడుతూ ఇప్పటి వరకు ఉత్తరప్రదేశ్ మరియు జార్ఖండ్ వలస కార్మికులను దాదాపు అందరిని వారి వారి సొంత రాష్ట్రాలకు పంపియడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది బీహార్ వలస కార్మికులు తమకు pass లు ఇచ్చి వారం రోజులు అయింది మమ్మల్ని తీసుకెళ్లడం లేదు అని ప్రజా సంకల్పం ద్రుష్టికి తీసుకొస్తే గ్రూప్ @అడ్మిన్ గా నేను మరియు గ్రూప్ సభ్యులము వెళ్లి వారికి అన్ని వివరములు క్లుప్తంగా చెప్పడం జరిగింది. తరువాత పోలీస్ అధికారులతో మాట్లాడగా త్వరలో బీహార్ వాసులకు కూడా పంపియడం జరుగుతుంది అని చెప్పారు. 
ముఖ్యంగా రాచకొండ CP మహేష్ భగవత్ IPS సర్ గారికి, మల్కాజిగిరి DCP రక్షితా మూర్తి IPS మేడం గారికి, ఉప్పల్ ACP నర్సింహా రెడ్డి సర్ గారికి, ఉప్పల్ PS ఇన్స్పెక్టర్ రంగా స్వామి సర్ గారికి, SI లు  షైక్ మెహ్బలి సర్, జయరాం సర్, శ్రీకాంత్ సర్ అందరికి కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలువుతుంది ప్రజా సంకల్పం గ్రూప్ 🙏. 

గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
17/05/2020
Copy to Group link Media. 

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment