Sunday, May 31, 2020

తెలంగాణ HRC లో బాలల హక్కుల సంఘం పిటిషన్ (31/05/2020)

*తెలంగాణహెచ్‌ఆర్సీలో బాలల హక్కుల సంఘం అత్యవసర పిటిషన్‌**
May 31 2020 @ 15:55PM

హైదరాబాద్‌: గ్రేటర్‌ పరిధిలోని ఫీర్జాదీగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని చంగిచర్ల సుశీల టౌన్‌షిప్‌లో వీధి కుక్కల దాడిలో ఆరేళ్ల బాలిక మృతిచెందిన ఘటన పై *బాలల హక్కుల సంఘం మానవ హక్కుల కమిషన్‌లో అత్యవసర పిటీషన్‌ దాఖలు చేసింది*. నిరు పేదలైన అంగోత్‌ హోలీ, సంగీత కూతురు బాలిక అంగోత్‌ బేబీ వీధికుక్కల దాడిలో చనిపోయింది. ఈ ఘటన నేపధ్యంలో  వీధి కుక్కలను, పందులను నివాస సముదాయాల మధ్య ఉండకుండా తరలించడంలో కార్పొరేషన్‌ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు. బాలిక తీవ్ర గాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంటే ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ వారు వివిధ ఆస్పత్రులకు తిప్పి సకాలంలో సరైన వైద్యం అందించలేకపోయారని *బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుత రావు ఆరోపించారు*.

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతిచెందిందని అన్నారు. ప్రభుత్వం తరపున ఆ పాపకుటుంబానికి పది లక్షల నష్టపరిహారం చెల్లించాలని మున్పిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శిని, ఆసుపత్రుల పై చర్యలకు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ ఆదేశించాలని బాలల హక్కుల సంఘం రాష్ట్ర మావన హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసిందని తెలిపారు. 

గ్రూప్ link Media ABN ఆంధ్రజ్యోతి సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
31/05/2020

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment