Tuesday, May 12, 2020

GHMC పరిధిలో ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్ మరియు ఉప్పల్ డివిజన్ లలో **వలస కార్మికుల బాధలు ఎవరు పట్టించుకోరా **

**ప్రజా సంకల్పం **
Praja Sankalpam 

**వలస కార్మికులను పట్టించుకోరా **

తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ గారికి మరియు తెలంగాణ DGP మహేందర్ రెడ్డి సర్ గారికి మరియు రాచకొండ CP మహేష్ భగవత్ సర్ గారికి మనవి చేయడం ఏమనగా.. 

ఉప్పల్ నియోజకవర్గం రామంతాపూర్  & ఉప్పల్ డివిజన్ లలోని వలస కార్మికులకు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధముగా పోలీస్ అధికారులు వారికి రైలు ప్రయాణానికి పాస్ లు ఇచ్చి వారం రోజులు అయింది. ఇంతవరకు వారికి ఎలాంటి సమాచారం రైలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వెళ్ళేది ఇవ్వలేదు. ఎందుకు సర్ వారిని ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాగే వారికి రేషన్ కార్డులు కూడా లేవు. 
ముఖ్యమంత్రి గారు చెప్పారు రేషన్ కార్డు లేని వారికి ఉచితంగా 12కిలోల బియ్యం మరియు 500 రూపాయలు సహాయం ప్రభుత్వం తరపున ఇస్తున్నాము అని, కానీ వీరికి ఆ సహాయం ఇప్పటి వరకు అందలేదు. *ప్రజా సంకల్పం ** గ్రూప్  ఉప్పల్ డిప్యుటీ తహసీల్దార్ సర్ గారిని ఈ విషయం పై సంప్రదించగా మేము అందిరికి ఇచ్చాము అని చెప్పడం జరిగింది. 
CM సర్ చెప్పినప్పటి నుంచి *ప్రజా సంకల్పం ** వలస కార్మికుల వివరాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. కానీ స్పందించలేదు. 

ఇదే విషయం మేడ్చల్ జిల్లా కలెక్టర్ V. వెంకటేశ్వర్లు సర్ గారి దృష్టికి తీసుకరావడం జరిగింది. అయినా కూడా ఉప్పల్ తహసీల్దార్ సర్ కానీ డీప్యూటీ తహసీల్దార్ సర్ కానీ ఏమంటున్నారు అంటే రేషన్ బియ్యం లేవు మేము అందరికి ఇచ్చేసాము అని. ఇదెక్కడి న్యాయం సర్. 
అసలు వలస కార్మికుల వివరాలు ఎవరు సేకరించారు ఏ ప్రతిపాదికత మీద సేకరించారు ?? ఎదో నామమాత్రముగా సేకరించి చేతులు దులుపుకుంటే ఎలా సర్  ?? 

సర్ **వలస కార్మికులు ఎన్నో మైళ్ళ దూరం నుంచి వచ్చి ఇక్కడి అభివృద్ధి లో పాలుపంచుకుంటూ వారి జీవనోపాధి సంపాదించుకుంటున్నారు, వారు కూడా మనుషులే, వారు కూడా భారత దేశ పౌరులే అది మరచిపోవద్దు. అంటే వారికి  ఇక్కడ ఓటు హక్కు లేదు అని వారిని చులకనగా చూడకండి సర్ దయచేసి **.

ఇప్పటికైనా వారికి న్యాయం చేయండి. 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
13/05/2020.
Copy to Group link Media. 
https://prajasankalpam1.blogspot.com/
twitter  @Praja_Snklpm

No comments:

Post a Comment