Saturday, May 30, 2020

రుతుపవనాలు కేరళలో

Breaking: 

*కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు*
మండుటెండల వల్ల విసిగిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.

మండుటెండల వల్ల విసిగిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఇవాళ నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ పేర్కొంది. జూన్ 1 ప్రారంభ తేదీకి కంటే రెండు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళను తాకినట్టు స్కైమెట్ నివేదించింది. అయితే రుతుపవనాల రాకపై ప్రభుత్వ యాజమాన్యంలోని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.జూన్ 1 న రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఇటీవల IMD తెలిపింది. కాగా 2019 లో, రుతుపవనాలు కేరళలో ఆలస్యంగా(జూన్ 8న) ప్రారంభమయ్యాయి.

దాంతో దేశంలోని మిగిలిన ప్రాంతాలలో దాని పురోగతి మందగించింది, ఇది జూన్లో సాధారణ వర్షానికి దారితీసింది. అయితే, ఈ సంవత్సరం అనుకున్నదానికంటే ముందుగానే రుతుపవనాలు రావడంతో సీజన్ మొదట్లోనే వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది సాధారణ రుతుపవనాలు వస్తాయని IMD అంచనా వేసింది. కాగా జూన్-సెప్టెంబర్ రుతుపవనాల వర్షపాతం 88 సెం.మీ దీర్ఘకాలిక సగటు (ఎల్‌పిఎ) కు అనుగుణంగా ఉండే అవకాశం ఉందని ఏప్రిల్‌లో ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ నాయర్ తెలిపారు.

గ్రూప్ link Media hmtv  సౌజన్యంతో 

ప్రజా సంకల్పం 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
30/05/2020

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment