*రాచకొండ సీపీ సంచలన నిర్ణయం*
హైదరాబాద్: అక్రమాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులే కరెప్షన్‌కు తెగబడ్డారు. ఓ ముఠా చేస్తోన్న అక్రమ దందాలకు అండగా నిలిచి పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తీసుకొచ్చారు. చివరకు వ్యవహారం బయటపడడంతో సస్పెన్షన్ వేటుకు బలయ్యారు. మేడిపల్లిలో డిజీల్ అక్రమ దందాకు సహకరిస్తున్న ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే. మేడిపల్లిల్లో డీజిల్ అక్రమ దందా చేస్తున్న ఓ ముఠాకు పోలీసులు కొంతకాలంగా సహకరిస్తున్నారు. ఇందులో ఎస్ఓటీ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, ఎస్‌బీ కానిస్టేబుల్‌తో పాటు మేడిపల్లి పోలీసు స్టేషన్‌కు చెందిన మరో ముగ్గురు కానిస్టేబుల్స్ ఉన్నారు. అయితే ఈనెల 18న మేడిపల్లిలో డిజీల్ చోరీ చేస్తున్న ఆ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.
ముఠాను విచారించే క్రమంలో అక్రమ దందాకు సహకరిస్తున్న పోలీసులు వ్యవహారం బయటపడింది. దీంతో డిజీల్ ముఠాకు సహకరిస్తున్న ఆ ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇతర పోలీసుల హస్తంపైనా దర్యాప్తు కొనసాగుతోంది.
గ్రూప్ link Media నవ తెలంగాణ సౌజన్యంతో
ప్రజా సంకల్పం
గ్రూప్ @అడ్మిన్ bplkmCS
Bapatla Krishnamohan
31/05/2020
No comments:
Post a Comment