Tuesday, May 12, 2020

Reopen Government Office in Telangana

నేడు తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ తిరిగి ప్రారంభం

కేసిఆర్ సర్కార్ లాక్‌డౌన్ నిబంధనల్ని ఒక్కొక్కటిగా సడలిస్తోంది. తెలంగాణలో ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉన్నా.. ఇటీవలే మద్యం దుకాణాలు ప్రారంభించి మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలన్నీ తెరవాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు రానున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న జిల్లాల్లోని ఉద్యోగులంతా విధులకు రావాలని ఆదేశాలు వెళ్లాయి. అందువల్ల జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి ఆఫీసులన్నీ పనిచేస్తాయి.

ప్రభుత్వఉద్యోగులు,
తెలంగాణలో ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉన్నా. మిగతా శాఖల ఉద్యోగులు మాత్రం రొటేషన్ పద్ధతిలో వస్తారు. 33 శాతం మంది మాత్రమే హాజరవుతారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు విధులకు హాజరుకానున్నారు.

ప్రస్తుతం అన్ని జోన్లలో వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్‌ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. ఇవాళ్టి నుంచి రెడ్‌జోన్ జిల్లాల్లో ఈ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేస్తారు. హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాల్లో కరోనా కేసులు తగ్గడంతో... తెలంగాణ ప్రభుత్వం కూడా నిబంధనల్ని సడలిస్తుంది. ఈ నెల 15 సీఎం కేసీఆర్ రివ్యూ మీటింగ్ ఉంటుంది. సడలింపులు, మినహాయింపులు ఇస్తారని సమాచారం. 

Group link Media hmtv సౌజన్యంతో 
గ్రూప్ @అడ్మిన్ bplkmCS 
Bapatla Krishnamohan 
11/05/2020
Copy to Group link Media

No comments:

Post a Comment