తాజా వార్తలు
*రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా నియమించండి: హైకోర్టు*
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తొలగింపు వ్యవహారంపై ఉన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. *రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన ఉన్నత న్యాయస్థానం...**
రమేశ్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్ 200ని పూర్తిగా మార్చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ధర్మాసనం కొట్టివేసింది. *ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.* ఈ క్షణం నుంచి రమేశ్‌కుమార్ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
*మళ్లీ పదవిలోకి వచ్చా: రమేశ్ కుమార్*
అమరావతి: ఏపీ హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ పదవిలోకి వచ్చానని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మార్పు వ్యవహారంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని వివరించారు. వ్యక్తులు శాశ్వతంగా ఉండరని, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు చిరస్థాయిగా ఉంటాయని రమేశ్ కుమార్ అన్నారు.
2016 జనవరి 30న అప్పటి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను అయిదేళ్ల కాలానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. రమేశ్‌కుమార్ 2016 ఏప్రిల్ 1న బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం 2021 మార్చి నెలాఖరు వరకు ఉంది.
గ్రూప్ link Media ఈనాడు సౌజన్యంతో
ప్రజా సంకల్పం
గ్రూప్ @అడ్మిన్ bplkmCS
Bapatla Krishnamohan
29/05/2020.
Copy to Group link Media
No comments:
Post a Comment