*వీళ్ళు నడిచి వెళ్లి పోవడం ఒక్కటే కాదు నాకు బాధ. ఇంకా ఎక్కువ బాధ...*
వీళ్లకి కోపం రాకపోవడం గురించి
మేం కూడా మనుషులమే అనే ఆత్మగౌరవ ప్రకటన చెయ్యక పోవడం గురించి
ఎదురు తిరగక పోవడం గురించి
కరువు దాడులు చెయ్యక పోవడం గురించి
*కొడుతూ ఉండు, తంతూ ఉండూ.. కాళ్ళా వేళ్ళా పడుతూ దాక్కునీ, పాక్కునీ, నడుచుకుంటూ పోతా* అంటం గురించి.
దేశంమీద, నీమీద, నామీద నమ్మకం పోతే పోనీ, వాళ్ళమీద వాళ్లకి నమ్మకమూ, గౌరవమూ లేకుండా, ఇంత నిస్తేజంగా వీళ్లని తయారు చెయ్యగలిగారు! ఎలా సాధ్యం! ఒక్క రోజులో, ఒక్క దశాబ్దంలో జరగ గలిగింది కాదు. వీళ్ళు ఇలా ఉన్నారంటే ఈ దేశంలో ఉన్న మొత్తం మేధో జగత్తు సిగ్గుపడాలి.
_____✍️ Akkiraju Bhattiprolu
చాలాసార్లు అనిపిస్తుంది.
ప్రపంచంలో ఉన్న బీదరికం, నిరక్షరాస్యత, వెనుకబాటుతనమూ ఇవన్నీ యాదృచ్చికమైనవి కాదని. మనుషుల్ని exploit చేయడం కోసం, కావాలనే ఇవన్నీ పెంచి పోషింపబడుతున్నవని.
కడుపు నిండిన వారిని, విద్య నేర్చిన వారిని, అభివృద్ధి చెందిన వారినీ భయపెట్టలేం, కంట్రోల్ చేయలేం,
exploit చేయలేం. *అందుకే వ్యక్తి వికాసం కంటే ప్రభుత్వాలకు మానవ వనరుల పెంపకమే ముఖ్యం. Citizens are manipulatable voters*.
ALL I WANNA SAY IS THAT
THEY DON'T REALLY CARE ABOUT US
వలస కార్మికుల నడక ఆగిపోవచ్చు గానీ వారి exploitation ఆగిపోదు.
__ rambabu thota.
గ్రూప్ link Media ప్రతినిధులు అక్కిరాజు గారికి మరియు రాంబాబు తోట గారికి నా నమస్కారాలు. మీ భావాలు ఎప్పుడు కూడా సగటు మనుషుల హృదయాలను తాకుతుంది.
గ్రూప్ @అడ్మిన్ bplkmCS
Bapatla Krishnamohan
21/05/2020
Copy to Group link Media
No comments:
Post a Comment