Monday, May 18, 2020

వలస కార్మికుల కష్టాలు

నగరాల్లోని భారీ భవంతులు, నగరాన్నీ నగరాన్నీ కలిపే నాలుగు వరసల జాతీయ రహదార్లు,  పెద్దపెద్ద వంతెనలు, అభివృద్ధి అనుకుంటున్నవన్నీ పల్లె నుండి వలస వచ్చిన అతిథి కార్మికుల శ్రమతోనే కట్టబడ్డాయి. ఈ దేశం మొత్తం వారికి ఋణపడి ఉంది. 

కానీ ఈరోజు వారంతా సొంత గూటికి చేరడానికి, 1200 కిలోమీటర్లు, 1600 కిలోమీటర్లు నడిచిపోతూ ఉంటే, సామాన్య జనం ముందు కొచ్చి, తమకు వీలైన సాయం చేస్తున్నారు. **కానీ వారి వల్ల ఎక్కువ లబ్ది పొందిన ఆ బడా బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాలూ మాకేం సంబంధం లేదన్నట్టు నడిరోడ్డులో వదిలేసినప్పుడు అనిపిస్తుంది, ఈ కట్టడాలన్నీ కట్టింది కార్మికుల శ్రమతో కాదు, వారి రక్తంతో అని**. 

ఇంత అమానుషత్వాన్నీ, ఇంత insensitivity నీ  చరిత్ర పుటల్లో ఎక్కించకపోయినా, మన మనసుల్లో నుండి చెరిగిపోదు.
గ్రూప్ link Media @fb  (రాంబాబు తోట గారి ప్రచురణ)
**ప్రజా సంకల్పం **
Praja Sankalpam 
గ్రూప్ @అడ్మిన్  bplkmCS 
Bapatla Krishnamohan 
18/05/2020

https://prajasankalpam1.blogspot.com/

No comments:

Post a Comment