Tuesday, November 5, 2024
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
*_కేటీఆర్ పై ఏసీబీ కేసు.?_*
_*2014 జూన్ నుండి ఈరోజు వరకు లక్షల కోట్ల దోపిడీ..*_
సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త...
Monday, November 4, 2024
జలమండలి ఓటీఎస్-2024 గడువును ప్రభుత్వం పొడిగించింది
ఓటీఎస్ గడువు పెంపు
=================
# ఈ నెల 30 వరకు పొడిగింపు
# వినియోగదారుల డిమాండ్ మేరకు నిర్ణయం
ఓటీఎస్-2024 గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. పథకం గడువును పెంచాలని వినియోగదారుల నుంచి భారీ ఎత్తున డిమాండ్ లు రావడంతో జలమండలి ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖకు స్పందించిన ప్రభుత్వం.. పథకం గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా కనెక్షన్ బిల్లులను వసూలు చేసేందుకు ఈ పథకం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న నల్లా బిల్లుల్ని.. ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. మొదటగా ఈ పథకాన్ని అక్టోబర్ 1 నుంచి 31 వరకు ప్రకటించి అమలు చేశారు. కానీ ఇదే నెలలో దసరా, దీపావళి వంటి పండగలు రావడంతో వినియోగదారులపై ఆర్థిక భారం పడింది. మరి కొందరు సొంతూళ్లకు వెళ్లారు. అలాంటి వారు ఈ పథకాన్ని వినియోగించుకోలేకపోయారు. దీంతో మరో అవకాశం ఇవ్వాలని అధికారుల్ని కోరారు. దీంతో జలమండలి.. ప్రభుత్వానికి లేఖ రాయగా, అందుకు సానుకూలంగా స్పందించి.. పథకం గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది.
#బిల్లులు_చెల్లించే_విధానం
# జలమండలి కార్యాలయాలు, ఆన్ లైన్ విధానంలో మీ-సేవ, ఏపీ ఆన్ లైన్ కేంద్రాలు, # ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, NEFT, RTGS, BPPS, జలమండలి అధికారిక వెబ్ సైట్, లైన్ మెన్ల ద్వారా చెల్లించవచ్చు.
# జలమండలి అందించిన QR Code ను స్కాన్ చేయడం ద్వారా.. వినియోగదారులు తమ బకాయిలు, చెల్లించే మొత్తం, రాయితీ తదితర వివరాలు తెలుసుకోవచ్చు.
ఓటీఎస్ పథకంపై ఏవైనా సందేహాలుంటే.. జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313 కు ఫోన్ చేసి వాటిని నివృతి చేసుకోవచ్చు.
@TelanganaCMO @TelanganaCS @PrlsecyMAUD @MDHMWSSB
Courtesy / Source by : https://x.com/HMWSSBOnline/status/1853469487598862691?t=uieZWX8GFJRELEtG6WSrcA&s=19
*ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-2025*
_*#తెలంగాణను కబ్జా చేస్తుండ్రు*_
_*#కేసీఆర్ జైలుకు వెళ్తాడా ?*_
Sunday, November 3, 2024
HMDA అధికారిక ప్రకటన:
కులగణన...డెడికేటెడ్ కమిషన్
స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. అందరి ఏకాభిప్రాయం మేరకు తక్షణం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
➡️కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యం, న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై ముఖ్యమంత్రి గారు తన నివాసంలో మంత్రులు @UttamINC గారు, @Min_SridharBabu గారు, @DamodarCilarapu గారు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు @Bmaheshgoud6666 గారు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
➡️రాష్ట్రంలో ఈ నెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని స్పష్టం చేశారు.
➡️అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని సీఎం గారు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన రేపటిలోగా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
➡️ఇలాంటి కీలకమైన అంశాల్లో ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు ఉండవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అధికారులకు చెప్పారు. #Telangana #BCReservations
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1853118832594043391?t=54KxlwkzGjrt3VjsFWB1nQ&s=19
Saturday, November 2, 2024
Telangana Greenlights Second Phase of Hyderabad Metro Project with Rs 24,269 Crore Budget
“ఎవరైనా లంచం అడిగితే 1064 కు డయల్ చేయండి”
*_బాల సాయిబాబా ఆస్తి మటాష్.!_*
సీఎం గారితో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారితో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు
రాష్ట్రంలోని యూనివర్సిటీలను నూటికి నూరు శాతం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఉన్నత విద్యకు సంబంధించి గడిచిన పదేండ్లలో దెబ్బతిన్న వ్యవస్థలను తిరిగి పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఉన్నత విద్యా మండలికి, వైస్ చాన్సలర్లకు సూచించారు.
✅నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారితో పాటు అన్ని యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యామండలి, వీసీలకు సీఎం గారు దిశానిర్దేశం చేశారు.
✅ఎవరి ప్రభావితంతోనో వైఎస్ చాన్సలర్ పోస్టులకు ఎంపిక జరగలేదు. మెరిట్, సామాజిక సమీకరణల ఆధారంగానే ఎంపిక జరిగింది. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి.
✅కొంతకాలంగా యూనివర్సిటీల పట్ల విశ్వాసం సన్నగిల్లింది. తిరిగి వర్సిటీల గౌరవం పెంచే దిశగా పని చేయాలి.
✅యూనివర్సిటీలను 100 శాతం ప్రక్షాళన చేయాలి. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
✅యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసి ప్రమాణాలను పెంచే చర్యలు మొదలు పెట్టాలి. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలి. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలి.
✅మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్లకి స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వ సహకారం ఉంటుంది. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంది.
✅యూనివర్సిటీల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలి. అలాంటి విద్యార్థులను గమనించి కౌన్సెలింగ్ ఇవ్వాలి.
✅సీఎం సలహాదారు @Vemnarenderredy గారు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. బాలకృష్ణా రెడ్డి, కార్యదర్శి ప్రొ. శ్రీరాం వెంకటేశ్, విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం గారితో పాటు ఆయా వర్సిటీలకు కొత్తగా నియమితులైన వైస్ చాన్సలర్లు ప్రొ. ఎం. కుమార్ (ఉస్మానియా), ప్రొ. ప్రతాప రెడ్డి (కాకతీయ), ప్రొ. జీఎన్ శ్రీనివాస్ (పాలమూరు), ప్రొ. నిత్యానంద రావు (తెలుగు), ప్రొ. అల్తాఫ్ హుస్సేన్ (మహాత్మాగాంధీ), ప్రొ. యాదగిరి రావు (తెలంగాణ), ప్రొ. అల్దాస్ జానయ్య (జయశంకర్ వ్యవసాయ), ప్రొ. రాజిరెడ్డి (కొండాలక్ష్మణ్ బాపూజీ ఉద్యాన వర్సిటీ), ప్రొ. ఉమేష్ కుమార్ (శాతవాహన), ప్రొ. సూర్య ధనుంజయ (మహిళా వర్సిటీ), ప్రొ. గోవర్దన్ (బాసర ఐఐఐటీ) గార్లు ముఖ్యమంత్రి గారిని కలిసిన వారిలో ఉన్నారు.
#RisingTelangana #University #HigherEductaion
Courtesy / Source by : https://x.com/TelanganaCMO/status/1852631626263802358?t=YIYlVhkGGx-XoRx0vFMZ8w&s=19